UK Royal Award
UK Royal Award: భారత్‌కు చెందిన ఓ టీనేజీ అమ్మాయి లండన్ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. అది కూడా లండన్ ప్రిన్స్ చార్లెస్‌ను కలిసి ఆయన చేతుల మీదుగా అందుకునే అరుదైన అవకాశం దక్కించుకుంది. ఎవరా యువతి.. అవార్డు ఎందుకు వచ్చింది. అనే వివరాలు తెలుసుకుందాం..
18 ఏళ్ల రిక్షా డ్రైవర్..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రెచ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఆర్తి రిక్షా డ్రైవర్. ఆమెను లండన్‌లోని ప్రతిష్టాత్మక అమల్ కూన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డు వరించింది. ఈ అవార్డును బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ ప్రిన్స్ ట్రస్టు స్పాన్సర్ చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఇంగ్లిష్ బారిస్టర్ అమల్ క్లూనీ పేరు పెట్టారు. ఆర్తి ప్రభుత్వ ఈ రిక్షా చొరవతో డ్రైవర్‌గా పనిచేసి ఇతర యువతను ప్రేరేపించింది. అందుకు లండన్ ప్రతిష్టాత్మక అవార్డుకు బ్రిటిష్ స్వచ్ఛంద సంస్థ అవార్డుకు ఎంపిక చేసింది.
పింక్ రిక్షా ఇనిషియేటివ్..
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2020లో మిషన్‌శక్తి పథకాన్ని ప్రారంభించింది. రక్షణ, శిక్షణ, స్వావలంబన ద్వారా మహిళలకు సాధికారత కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద పింక్ ఈ రిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా మహిళలకు ఈ రిక్షాలు నడపడంలో శిక్షణ, ట్రాపిక్ నిబంధనల గురించి సమాచారాన్ని అందిస్తుంది. వితంతువుల, ఒంటరి తల్లులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆర్తి గతేడాది జూలైలో భారత ప్రభుత్వం పింక్ ఈ రిక్షా పథకాన్ని పరిచయం చేసేందుకు ముందుకు వచ్చారు. యూపీలో ఆమె తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్. చిన్న వయసులో ఆమె అందించిన గొప్ప సహకారానికి ప్రిన్స్ ట్రస్ట్ అవార్డుని తెచ్చిపెట్టింది. అసమానతలకు వ్యతిరేకంగా తన చుట్టూ ఉన్నవారిలో శాశ్వతమైన మార్పు తీసుకొచ్చేలా ప్రపంచ పనిలో విజయం సాధించిన యువతులను ఈ అవార్డుతో సత్కరిస్తుంది ప్రిన్స్ ట్రస్టు. ఈ ఏడాది ఆర్తిని ఎంపిక చేసింది.
తొలి పింక్ ఈ రిక్షా డ్రైవర్‌గా..
ఇక ప్రతిష్టాత్మక లండన్ అవార్డు గెల్చుకున్న ఆర్తి.. పింక్ ఈరిక్షా డ్రైవర్. ఆమె కూడా ఒంటరి తల్లి. దీంతో మిషన్ శక్తి పథకం ద్వారా శిక్షణ పొంది తొలి ఈ రిక్షా డ్రైవర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అవార్డు గెలుచుకున్న సందర్భంగా ఆర్తి మాట్లాడుతూ సవాళ్లను ఎదుర్కొనేలా ఇతర అమ్మాయిలకు స్ఫూర్తినివ్వగలిగినందుకు గర్విస్తున్నానని తెలిపింది. ఈ కొత్త స్వాతంత్ర్యం ప్రపంచాన్ని వేరే కోణంలో చూసేందుకు నన్ను అనుమతించిందని పేర్కొంది. ఇప్పుడ నేను నా కలలన మాత్రమే కాకుండా నా కుమార్తె కలలను కూడా నెరవేరుస్తాను. ఈ చొరవే నాకు బకింగ్హామ్ ప్యాలెస్లో కింగ్ చార్లెస్ ను కలిసే అవకాశం లభించేలా చేసింది అని వెల్లడించింది. ఇది ఒక అద్భుతమైన అనుభవంగా అభివర్ణించింది. ప్రిన్స్ చార్లెస్ తనకు ఈ రిక్షా డ్రైవింగ్‌పై ఉన్న ఆసక్తిని శ్రద్ధగా విన్నారని తెలిపింది. తన ఆటో రిక్షా కాలుష్యం కలిగించని వాహనం అని చార్లెస్‌తో గర్వంగా చెప్పానని ఆర్తి పేర్కొంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Prestigious award for young indian woman in london
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com