US Green Card: అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలంటే గ్రీన్ కార్డు అవసరం. దీని కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు ఎందరో ఉన్నారు. భారతీయులు ఎందరో అమెరికాలో కొన్నేళ్లుగా ఉంటున్నారు. కానీ వారిలో గ్రీన్ కార్డు ఉన్న వారు తక్కువే. దీంతో వారందరు గ్రీన్ కార్డు కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. అయినా వారి ఆశల తీరడం లేదు. అమెరికా పౌరసత్వం కావాలంటే గ్రీన్ కార్డు తప్పనిసరి. దీంతో ఎలాగైనా గ్రీన్ కార్డు సాధించాలనే తపన అందరిలో ఉండటం సహజమే. దీంతో గ్రీన్ కార్డు ప్రాధాన్యం ఎంతలా ఉందో అర్థమవుతోంది.
దశాబ్దాలుగా మన భారతీయులు అమెరికాలో ఉంటున్నా వారికి గ్రీన్ కార్డు అందడం లేదు. దీంతో వారు అమెరికా పౌరులుగా గుర్తింపు పొందడం లేదు. దీంతో వారికి రావాల్సిన రాయితీలు రావడం లేదు. దీంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. గ్రీన్ కార్డు పొందితే అందరికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. దీని కోసం అందరు గ్రీన్ కార్డు కావాలని తాపత్రయపడుతున్నారు. మన దేశం నుంచి వెళ్లిన చాలా మంది వివిధ రంగాల్లో స్థిరపడి ఏళ్లుగా అక్కడ సేవలందిస్తున్నా వారికి అమెరికా పౌరసత్వం మాత్రం దక్కడం లేదు. దీంతో వారంతా నైరాశ్యంలో మునిగిపోయారు. తమకు గ్రీన్ కార్డు దక్కుతుందో లేదోననే బెంగ వారిని వెంటాడుతోంది.
Also Read: PFI Ban- Turkey: పీఎఫ్ఐ ని భారత్ నిషేధిస్తే టర్కీ కి ఎందుకు ఇబ్బంది?
అమెరికాలో గ్రీన్ కార్డు విషయమై పలు చర్చలు జరుగుతున్నాయి. ఏడేళ్లుగా దేశంలో ఉండేవారికి గ్రీన్ కార్డు ఇవ్వాలనే బిల్లును తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎంతో మందికి ఊరట లభించనుంది. దీంతో భారతీయులకు కూడా మేలు జరగనుంది. ఆ దేశంలో ఉండి వారికి సేవలు చేస్తున్నా అక్కడి పౌరసత్వం దక్కకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ప్రవేశపెట్టామని సెనేటర్ అలెక్స్ పాడిల్లా తెలిపారు. గ్రీన్ కార్డు పొందిన వారు శాశ్వత పౌరులుగా గుర్తింపు పొందుతారు. హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వచ్చిన వారు గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా బిల్లు ఆమోదం పొందితే వలసదారుల కష్టాలు తరనున్నట్లు చెబుతున్నారు.
చాలా మంది విద్యార్థులు కూడా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నారు. గ్రీన్ కార్డు బిల్లు ఆమోదం పొందితే చాలా మందికి లబ్ధి చేకూరనుంది. ఎన్నో ఏళ్లుగా అమెరికా పౌరసత్వం కోసం వేచి చూస్తున్న వారికి ఎంతో లాభం కలగనుంది. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకొచ్చే బిల్లు ఆమోదం పొందుతుందో లేదో తెలియడం లేదు. ఒకవేళ ఆమోదం పొందితే కనుక భారతీయులకు ఎంతో లాభం చేకూరనుందని చెబుతున్నారు. భవిష్యత్ లో కూడా అక్కడకు వెళ్లిన వారికి అక్కడి పౌరసత్వం లభిస్తే ఇక వారికి అక్కడ జీవించడం పెద్ద కష్టమేమీ కాదు.
Also Read: Daughter Killed Father: దృశ్యం సినిమా చూసి ప్రియుడితో కలిసి తండ్రిని చంపింది… ఓ కూతురి కిరాతక స్టోరీ