https://oktelugu.com/

Nara Lokesh Birth Day : యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Nara Lokesh Birth Day : తెలుగుదేశం యువ నాయకులు నారాలోకేష్ మేనియా మన ఆంధ్రాలోనే కాదు.. మనల్ని పాలించిన బ్రిటన్ లోనూ ప్రతిధ్వనించింది. అమెరికాలోనూ లోకేష్ జన్మదినాన్ని జరుపుకున్నారు. బ్రిటన్ లో అయితే పండుగలా చేశారు. లోకేష్ పాదయాత్రకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పుట్టినరోజున ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరం లోని హౌన్స్లో పట్టణంలో ఎన్నారై టీడీపీ యూకే వింగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 24, 2023 / 10:46 AM IST
    Follow us on

    Nara Lokesh Birth Day : తెలుగుదేశం యువ నాయకులు నారాలోకేష్ మేనియా మన ఆంధ్రాలోనే కాదు.. మనల్ని పాలించిన బ్రిటన్ లోనూ ప్రతిధ్వనించింది. అమెరికాలోనూ లోకేష్ జన్మదినాన్ని జరుపుకున్నారు. బ్రిటన్ లో అయితే పండుగలా చేశారు. లోకేష్ పాదయాత్రకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన పుట్టినరోజున ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

    తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరం లోని హౌన్స్లో పట్టణంలో ఎన్నారై టీడీపీ యూకే వింగ్ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపీ యూకే ప్రెసిడెంట్ పోపూరి వేణు మాధవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

    కోవెంట్రీ నగరంలో యూకె టీడీపీ వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.

    ఈ నెల 27న ప్రారంభం కాబోతున్న ‘యువగళం’ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ సంఘీభావంగా ఎన్నారై టీడీపీ యూకే శ్రేణులు పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు.

    అనంతరం సభా నిర్వహించారు. సభా ప్రాంగణం ‘ సైకో పోవాలి సైకిల్ రావాలి ‘ అనే నినాదంతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారై టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో కూరుకుపోయిన అంధకారం తొలగిపోయి అభివృద్ధి బాటలో నడవాలంటే బాబు మళ్ళీ సీఎం అవ్వాలని ,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

    కార్యక్రమంలో టీడీపీ యూకే నేతలు కిరణ్ పరచూరి, ప్రసన్న నాదెండ్ల ,సురేష్ కోరం, శ్రీనివాస్ పాలడుగు, నవీన్ జవ్వాడి, సుందర్ రాజు మల్లవరపు, మేరీ కల్పన,భాస్కర్ అమ్మినేని, అమర్నాథ్ మన్నే , కుమార్ నిట్టల తదితరులు పాల్గొన్నారు