Leena Nair: తెలివొక్కరి సొత్తు కాదమ్మా.. తోట కూర సుబ్బమ్మా అనేది సామెత. తెలివితేటలు ఎవరికో సంబంధించినవి కావు. మనిషి తనకున్న మెదడును ఉపయోగించుకోవడంలోనే మన సామర్థ్యం దాగి ఉంటుందని తెలుసుకోవాలి. ఎవరికైనా మెదడు ఒకే పరిమాణంలో ఉండటం తెలిసిందే. మన మనసు ఏకాగ్రతను కోల్పోకపోతే మన తెలివితేటలు ఇనుమడిస్తాయి. జీవితంలో మంచి స్థానం అందుకుంటాం. ప్రపంచంలోని చాలా దేశాల్లో మన వారు తమ తెలివితేటలతో మంచి పొజిషన్ లో ఉండటం చూస్తున్నాం.

గూగుల్, ట్విటర్, మైక్రో సాఫ్ట్, మాస్టర్ కార్డ్, అడోబ్, ఐబీఎమ్, పెప్సీకో లాంటి సంస్థల సీఈవోలు మనవారే కావడం గమనార్హం. దీంతో మనలో కూడా తెలివితేటలు ఉన్నా వాటిని సరైన విధంగా వినియోగించుకోవడంలోనే మన పనితనం దాగి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ కు చెందిన గ్లోబల్ లగ్జరీ ఫ్యాషన్ సంస్థ చానెల్ సీఈవోగా భారత సంతతికి చెందిన మహిళ లీనా నాయర్ నియమితులు కావడం తెలిసిందే.
ప్రపంచంలోనే టాప్ ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటిగా ఉన్న సంస్థ కావడంతో లీనా నాయర్ పై బాధ్యతలు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆమె తన బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఏటా లక్షల టర్నోవర్ సాధించే సంస్థకు సీఈవోగా నియమితులవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆమె సాధించారు. మన దేశ ప్రతిష్ట పెంచారు.
మహారాష్ర్టలోని కొల్హాపూర్ లో పుట్టిన లీనా నాయర్ ప్రాథమిక విద్యను స్థానికంగానే పూర్తి చేశారు. సాంగ్లీలోని వాల్ చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్రానిక్స్ ఇంజినీరింగ్ చదవారు. జంషెడ్ ూర్ లోని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో బంగారు పతకంలో మేనేజ్ మెంట్ డిగ్రీ అందుకున్నారు. 1992లో హిందూస్తాన్ యూనీలివర్ కంపెనీ లో మేనేజ్ మెంట్ ట్రైనీగా కెరీర్ ప్రారంభించారు. వివిధ హోదాల్లో పని చేశారు.
Also Read: Narendra Modi: అగ్రారాజ్యాల అధినేతలను దాటేసిన మోడీ.. ప్రపంచంలో ఆయన ర్యాంకు ఎంతంటే…?
52 ఏళ్ల లీనా నాయర్ సీఈవోగా నియమితులైన వారిలో అత్యంత పిన్నవయస్కురాలు, ప్రథమ మహిళ కావడం గమనార్హం. ఆమెకు దక్కిన గౌరవంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. ఇండియా నుంచి పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.
Also Read: PM Modi: తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన ప్రధాని మోడీ.. 2024 ఎన్నికలే టార్గెట్