TANA Annapurna : తానా.. అమెరికాలోని తెలుగువారు చేస్తున్న సేవలు పేదల ఆకలి తీరుస్తాయి. వారి ఆర్థిక అవసరాలకు తోడ్పాటు నందిస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి చూపిస్తున్నాయి. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో తానా సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవలు ఎందరిలో భరోసానిస్తున్నాయి. తాజాగా గుంటూరులో తానా ‘అన్నపూర్ణ’ పేరుతో అన్నదానం కేంద్రాన్ని ప్రారంభించింది.

తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ‘ఒక సంవత్సరం క్రితం 15 నెలలు మేము మా తానా ఫౌండేషన్ ప్రాజెక్ట్ ‘తానా అన్నపూర్ణ’ ప్రారంభించాము. ఇది విజయవాడ మరియు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రులలో ఏడాది పొడవునా 400 మంది రోగులకు , హాజరైన వారికి పౌష్టికాహారం అందించడానికి ఒక చొరవ చూపిస్తుందని’ తెలిపారు.

ఈరోజు గుంటూరు ఫీవర్ హాస్పిటల్‌లో ‘తానా అన్నపూర్ణ’ ప్రారంభించామని అంజయ్య చౌదరి తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను కొనసాగించి ఆకలిని తీర్చుతున్న మా దాతలు , స్పాన్సర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో మంది ఆపన్నులకు అన్నదానం చేస్తామని.. ఇందులో ప్రత్యేక రోజు భాగస్వామ్యం కావడం కోసం అందరికీ పిలుపునిచ్చారు. తద్వారా మీరు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావచ్చని తెలిపారు.

ఇంత గొప్ప ప్రయత్నాన్ని ముందుకు నడిపించినందుకు సురేష్ పుట్టగుంట గారికి అంజయ్య చౌదరి గారు ధన్యవాదాలు తెలిపారు.

