https://oktelugu.com/

Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడాది పాలన ఎలా సాగిందంటే?

Joe Biden: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టి నిన్నటితో ఏడాది పూర్తయింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాక ముందే నుంచే జో బైడెన్ కు పెను సవాళ్లు ఎదురైన సంగతి అందరికి తెల్సిందే. జో బైడెన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడని తానే అధ్యక్షుడినంటూ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడం వివాదానికి దారితీసింది. ట్రంప్ చర్యలకు ఎవరు అడ్డుచెప్పకపోవడం జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినా పదవీ బాధ్యతలు చేపట్టడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అనేక ఆరోపణలు, […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2022 / 10:53 AM IST
    Follow us on

    Joe Biden: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టి నిన్నటితో ఏడాది పూర్తయింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రాక ముందే నుంచే జో బైడెన్ కు పెను సవాళ్లు ఎదురైన సంగతి అందరికి తెల్సిందే. జో బైడెన్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడని తానే అధ్యక్షుడినంటూ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించుకోవడం వివాదానికి దారితీసింది. ట్రంప్ చర్యలకు ఎవరు అడ్డుచెప్పకపోవడం జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినా పదవీ బాధ్యతలు చేపట్టడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. అనేక ఆరోపణలు, దాడులు, విమర్శల మధ్యే చివరకు జో బైడెన్ వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు.

    జో బైడెన్ అధ్యక్షుడు అయ్యాక మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనలో తీసుకున్న పలు  నిర్ణయాలను తొలి ఏడాదిలోనే నిలిపి వేశారు. పారిస్ క్లయిమెట్ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరింది. కరోనా వైరస్ విషయంలో చైనాకు కొమ్ము కాస్తోందంటూ ట్రంప్ నాడు డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు రాగా జోబైడెన్ తిరిగి అమెరికాను అందులో చేర్చారు. ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చే ముస్లింలపై విధించిన నిషేధాన్ని సైతం ఎత్తివేశారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలను విడతీసే పాలసీని రద్దు చేశారు. పాలస్తీనా అథారిటీతోనూ మళ్లీ దౌత్య సంబంధాలను నెలకొల్పారు.

    Also Read:  రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్లు ఇవే !

    మరోవైపు అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో తాలిబాన్లు ఆ దేశాన్ని ఆక్రమించడంతో జో బైడెన్ ప్రభుత్వం విమర్శలపాలైంది. అత్యాధునిక ఆయుధ సంపత్తి కలిగిన అఫ్గాన్ బలగాల ముందు తాలిబాన్లు నిలువలేరని వాదించిన జో బైడెన్ మాటలు ఆచరణలో నిజం కాలేదు. అఫ్గాన్ తాలిబాన్ల వశం కావడంతో అమెరికా పౌరులను, సైన్యానికి సహకరించిన అఫ్గాన్లను విమానాల ద్వారా అమెరికాకు తరలించాల్సిన దుస్థితి నెలకొంది. అఫ్గానిస్తాన్‌లో వాస్తవ పరిస్థితిని అంచనా బైడెన్ విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి.

    అదేవిధంగా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ నడిచింది. చైనా మీద ట్రంప్ సర్కారు నాడు అనేక ఆంక్షలు పెట్టింది. ఆ తర్వాత వచ్చి బైడెన్ కూడా దాదాపు ట్రంప్ విధానాలనే కొనసాగిస్తూ వచ్చారు. తైవాన్ విషయంలోనూ చైనాను బైడెన్ ప్రభుత్వంహెచ్చరిస్తోంది. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి గత ఏడాది జూన్లో చైనాను ప్రపంచ భదత్రకు ముప్పుగా ప్రకటించింది. ఉత్తర కొరియా విషయంలో ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తే జోబైడెన్ నెమ్మదించారు. ఇరాన్, రష్యా, యుక్రెయిన్ విషయంలో జో బైడెన్ కు సవాళ్లు ఎదురవుతున్నాయి.

    జో బైడెన్ అధికారంలోకి వచ్చాక కరోనా కట్టడికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తొలి సంవత్సరంలో కోవిడ్ టీకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో 75శాతం అమెరికన్లు తొలి డోసు వ్యాక్సీన్ తీసుకోగా, 63శాతం మంది రెండో డోస్ టీకా తీసుకున్నారు. కిందటి నవంబరు నుంచి ఐదేళ్లు నిండిన పిల్లలకు కూడా అమెరికాలో వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఒమిక్రాన్ ను అదుపు చేసేందుకు 8కోట్ల బూస్టర్ డోసులను ప్రవేశపెట్టారు. అయితే కోవిడ్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించింది. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా అమెరికా నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

    Also Read:  విపరీతంగా పెరుగుతున్న కేసులు.. కొత్తగా ఎన్నంటే? దేశంలో థర్డ్ వేవ్ తప్పదా?