America: అగ్రరాజ్యం అమెరికాకు ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఏటా వేల మంది భారతీయులు వెళ్తున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు అక్కేడే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడుతున్నారు. డాలర్ డ్రీమ్ నెరవేర్చుకుంటున్నారు. ఇక ఉద్యోగాలు రాని కొంతమంది తప్పుడు పనులు చేస్తున్నారు. తర్వాత పోలీసులకు పట్టుబడి జైలుపాలవుతున్నారు. గడిచిన మూడు నెలల్లోనే పది మందికిపైగా భారతీయులు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. తాజాగా మహిళా క్యాబ్ డ్రైవర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ భారతీయుడుజైలుకు వెళ్లాడు. చెన్నా బొర్రా అనే 30 ఏళ్ల భారతీయుడు ఓ మహిళా క్యాబ్ డ్రైవర్‌తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేశారు.
అసభ్యకరంగా తాకాడని..
అమెరికాలో మహిళా క్యాబ్ డ్రైవర్లు కామన్ చెన్నా బొర్రా ఓ మహిళా క్యాబ్‌లో ప్రయాణిస్తూ… అమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేటు పార్ట్ తాకాడు. వారించినా వినలేదు.దీంతో బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే పోలీసులు చెన్నా బొర్రాను అదుపులోకి తీసుకున్నారు. గురువారం కోర్టులో హాజరుపర్చారు. బెయిల్ కోరగా కోర్టు తిరస్కరించింది. అక్టోబరు 15న అతను తిరిగి కోర్టుకు హాజరు కాబోతున్నాడు.
మూడు నెలల్లో ఇలా..
గడిచిన మూడు నెలల్లో పది మందికిపైగా భారతీయులు వేర్వేరు కేసుల్లో అరెస్టు అయ్యారు.
– 40 ఏళ్ల భారతీయ డాక్టర్ ఒమర్ అయిజాబ్ పిల్లలు, మహిళల నగ్న వీడియోలు తీశాడు. తన ఆస్పత్రికి వచ్చేవారిని రహస్యంగా వీడియో తీసి లైంగికంగా వేధించాడు బాధితురాలి ఫిర్యాదుతో ఆగస్టు 8న అరెస్టు చేశారు.
– ఆగస్టు 14, 15 తేదీల్లో అమెరికా పోలీసులు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న 21 మందిని అరెస్టు చేశారు. వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నారు.
– అమెరికాలోని టెక్సాస్‌లో మనవ అక్రమ రవాణా రాకెట్ నడుపుతున్న నలుగురు తెలుగువారిని అమెరికా పోలీసులు గత జూలైలో అరెస్టు చేశారు. ఓ ఇంటిపై దాడిచేసి భారత్ నుంచి అక్రమంగా అమెరికాకు తీసుకువచ్చిన 15 మంది మహిళలనుప్రిన్్సటన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చందన్ దాసిరెడ్డి(24), ద్వారకా గుండా(31), సంతోష్ కట్కూరి(31), అనీల్ మాలె(37)పై మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు అభియోగాలను పోలీసులు నమోదు చేశారు.
క్లిష్టంగా కేసులు..
భారతీయ చట్టాలకు విదేశీ చట్టాలు భిన్నంగా ఉంటాయి. వాటి గురించి తెలియకుండా నేరాలకు పాల్పడితే జైలు నుంచి బయటకు రావడం చాలా కష్టం. న్యాయమూర్తులు కూడా విదేశీయుల నేరాలపట్ల కఠినంగా ఉంటారు. దీంతో శిక్షలు కూడా ఎక్కువగా పడతాయి. గతంలో అరెస్టు అయి నేరం నిరూపితమైన భారతీయులు అమెరికా జైళ్లలో మగ్గుతున్నారు. ఇదిలా ఉంటే.. గత ఆగస్టులు అమెరికాలో నలుగురు భారతీయులు వ్యభిచారం కేసులో అరెస్టు అయ్యారు. ఇందులో ముగ్గురు తెలుగువారు ఉన్నారు. జూలైలోనూ నలుగురు భారతీయులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమ రవాణా కేసులో వీరిని అరెస్టు చేశారు.