Homeప్రవాస భారతీయులుIndian Student In UK: యూకేలో ఏంటీ అడుక్కోవడం.. భారతీయులకే అవమానం

Indian Student In UK: యూకేలో ఏంటీ అడుక్కోవడం.. భారతీయులకే అవమానం

Indian Student In UK: దూరపు కొండలు ఎప్పుడైనా నునుపుగానే ఉంటాయి. దగ్గరికి వెళ్లి చూస్తే తప్ప అసలు విషయం అర్థం కాదు. ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఉన్న భారతీయులకు పై సామెత అనుభవంలోకి వస్తోంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ వీడియో ఇంగ్లాండ్ లో ఉన్న భారతీయుల దుస్థితికి అద్దం పడుతోంది. నిన్నటిదాకా అమెరికాలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని అందరు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ లో అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఇంగ్లాండ్లో ఒకరు అద్దం తుడిచేందుకు ఓ భారతీయ విద్యార్థి ₹2,300 డిమాండ్ చేయడం అక్కడి పరిస్థితి అద్దం పడుతోంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపిస్తోంది.

Also Read: ఎమ్మెల్యే హత్యకే కుట్ర.. ఏపీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు

ఈ వీడియోని చూసిన చాలామంది అక్కడ విద్యార్థుల దయనీయ స్థితిని రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అక్కడి పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఇది పక్కా స్క్రిప్ట్ అని వాదిస్తున్నారు.. ఈ సంఘటన ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ ప్రాంతంలో జరిగిందని తెలుస్తోంది. బర్మింగ్ హమ్ ప్రాంతంలో ఓ వ్యక్తి కారు అద్దం తుడిచిన తర్వాత భారతీయ విద్యార్థి డబ్బు కోసం డిమాండ్ చేసింది. కార్యజమాని ఆమెను దొంగ అని వ్యాఖ్యానించాడు.. “ఇక్కడ నా జీవన వ్యయం పెరిగిపోయింది. నేను అడిగిన డబ్బు ఇవ్వాల్సిందే. లేకపోతే మీ వాహనాన్ని వెళ్లకుండా అడ్డుకుంటానని” ఆ విద్యార్థి బెదిరించింది. పార్క్ చేసిన వాహనాన్ని ఆ విద్యార్థి తుడిచింది. ఆ యజమాని కారులోకి వచ్చి అద్దాన్ని కిందికి దించగానే.. వెంటనే ఆ విద్యార్థి స్పందించడం మొదలుపెట్టింది. ” సార్ దయచేసి నాకు 20 పౌండ్లు ఇవ్వండి” అని అడిగింది. దానికి ఆ కారు యజమాని స్పందించి..”నేను డబ్బు ఎందుకు ఇవ్వాలి అని” అడిగాడు. “నేను ఇప్పుడే మీ కారు అద్దం శుభ్రం చేశాను” అని ఆ విద్యార్థి సమాధానం చెబుతుంది. ” నేను అయోమయంలో ఉన్నాను.. నువ్వు నా కారు త్వరగా తుడిచావా.. నీకు నేను 20 డాలర్లు ఎందుకు ఇవ్వాలి? జీవన వ్యయం పెరగడం ఏంటి? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? కారు అద్దం శుభ్రం చేయమని నేను అడిగానా” అని ఆ వ్యక్తి ప్రశ్నించాడు.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ వీడియో ను చాలామంది వీక్షించారు. వారందరూ కూడా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..”ఇదంతా నాటకీయంగా కనిపిస్తోందని” ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు..” ఇది ఒక ఎజెండా.. సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు.. అసలు అడగకుండా పని ఎలా చేస్తారు. ఆ తర్వాత డబ్బులు ఎలా డిమాండ్ చేస్తారు.. అతడు మిమ్మల్ని అద్దం తుడవమని అడగలేదు కదా.. అలాంటప్పుడు మీరు డబ్బు ఎలా డిమాండ్ చేస్తారని” ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అయితే ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చాడా? లేదా? అనేది ఈ వీడియోలో కనిపించలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular