GWTCS: అమెరికా గడ్డపై స్వర్ణోత్సవ సంబురం.. అట్టహాసంగా గ్రేటర్‌ వాషింగ్‌టన్‌ తెలుగు సంఘం గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు!

అమెరికా జనాభాలో భారతీయుల జనాభా 12 శాతం. ఏటా భారతీయుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అక్కడి భారతీయుల కోసం వివిధ రాష్ట్రాల వారు సంఘాలు ఏర్పాటు చేసుకుని సహకారం అందించుకుంటున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 30, 2024 11:34 am

GWTCS

Follow us on

GWTCS: అమెరికాకు ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అధికారికంగానే అనేకమంది అగ్రరాజ్యంలో అడుగుపెడుతున్నారు. స్టూడెంట్‌ వీసా, హెచ్‌1బీ వీసాపై వెళ్తున్నారు. తర్వాత అక్కడే ఉద్యోగాలు సాధించి స్థిరపడుతున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఒకప్పుడు సంపన్నులు మాత్రమే అమెరికా వెళ్లేవారు. నేడు మధ్యతరగతి విద్యార్థులు, ఉద్యోగులు కూడా అమెరికాబాట పడుతున్నారు. రుణాలు, ప్రభుత్వాలు అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా అమెరికాకు వెళ్లినవారు అక్కడి స్వింగ్‌ సిటీస్‌లో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా తెలుగువారంతా ఒకేచోట ఉండేందుకు ఇష్టపడుతున్నారు. పరస్పర సహకారం అందించుకుంటున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా కృషి చేస్తున్నారు. పండుగలు, వేడుకలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తానా, నాట్స్, గ్రేటర్‌ వాషింగ్‌టన్‌ తెలుగు సంఘం తదితర సంఘాలు ఆవిర్భవించాయి. ఈ సంఘాలు తెలుగువారి ఐక్యతకు కృషి చేస్తున్నాయి. ఇందుకోసం ఏటా వార్సికోత్సవాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా వాషింగ్‌టన్‌ తెలుగు సంఘం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించింది.

చీఫ్‌ గెస్ట్‌గా ఏపీ స్పీకర్‌..
గ్రేటర్‌ వాషింగ్‌టన్‌ తెలుగు కల్చరల్‌ సంఘం స్వర్ణోత్సవాలు రెండు రోజులపాటు నిర్వహించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వాషింగ్‌టన్‌లో జరిగిన కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన భార్య పద్మావతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

తెలుగుదనం ఉట్టిపడేలా..
ముఖ్య అతిథి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించేలా కృషి చేస్నుత్న గ్రేటర్‌ వాషింగ్‌టన్‌ తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ను అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిని ఏకం చేయడానికి ఇలాంటి వేడుకలు ఉపయోగపడతాయన్నారు.