https://oktelugu.com/

Sankranthi in Canada: కెనడాలో అంగరంగ వైభవంగా తాకా వారి 2022 సంక్రాంతి సంబరాలు

Sankranthi in Canada: తాకా (తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) జనవరి 15వ తేదీ, 2022 శనివారం  సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కెనడాలోని టొరంటో నగరంలోని శ్రుంగేరి కమ్యూనిటీ సెంటర్ (SVBF ఫౌండేషన్) నందు నిర్వహించి సామజిక మాధ్యమాల (Youtube, Twitter, Instagram, Facebook) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఈ కార్యక్రమాన్ని వందలాది మంది అంతర్జాలంలో వీక్షించి విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్, విద్య భావనం, మరియు రేణు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 20, 2022 / 11:05 AM IST
    Follow us on

    Sankranthi in Canada: తాకా (తెలుగు అలయన్సస్ ఆఫ్ కెనడా) జనవరి 15వ తేదీ, 2022 శనివారం  సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. కెనడాలోని టొరంటో నగరంలోని శ్రుంగేరి కమ్యూనిటీ సెంటర్ (SVBF ఫౌండేషన్) నందు నిర్వహించి సామజిక మాధ్యమాల (Youtube, Twitter, Instagram, Facebook) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసారు. ఈ కార్యక్రమాన్ని వందలాది మంది అంతర్జాలంలో వీక్షించి విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి అనిత సజ్జ, మహమ్మద్ ఖాజిల్, విద్య భావనం, మరియు రేణు కుందెమ్ వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు.

    మొదటగా తాకా అధ్యక్షులు కల్పనా మోటూరి, అనిత సజ్జ, సీత శ్రావణి పొన్నలపల్లి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కల్పనా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి కోవిడ్-19 కష్ట కాలంలో తాకా చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలు గురించి వివరించారు. తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను అందరినీ ఆహ్వానించి సంక్రాంతి పండుగ  ప్రాముఖ్యతను వివరించారు. 20కి పైగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కళా నృత్యాలు, సినిమా పాటలు, డాన్సులతో దాదాపు 4 గంటల పాటు ఉల్లాసంగా కార్యక్రమం జరిగింది.

    Also Read:  మనిషికి ఆనందాన్ని కలిగించేవి ఇవే !


    ప్రతి సంవత్సరం తాకా వారు ఆనవాయితీ ప్రకారం టొరంటో కాలమానం లో ప్రచురించిన తెలుగు క్యాలెండర్ ను సంక్రాంతి పండుగ నాడు ఆవిష్కరిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా టొరంటో తెలుగు తిధులు, నక్షత్రాలు కు అనుగుణంగా ప్రచురించిన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భం గా తెలుగు క్యాలెండర్ ముద్రణ కు సహకరించిన, టొరంటో కు తీసుకువచ్చిన రాకేష్ గరికిపాటి గారికి, ప్రసన్న తిరుచిరాపల్లి గారికి కల్పనా మోటూరి గారు కృతజ్ఞతలు తెలియజేసారు. తాకా ప్రస్తుత కార్యవ్రర్గం 2019-2021 మాజీ కార్యవర్గపు సభ్యులను వారి చేసిన కృషికి గాను మెమెంటోలతో సత్కరించారు.

    ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్ పుల్లంశెట్టి, డైరెక్టర్స్ అనిత సజ్జ, గణేష్ తెరల,రాణి మద్దెల మరియు ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ్ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక మరియు ఇతర వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, లోకేష్ చిల్లకూరు,రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరిని అధ్యక్షులు కల్పన మోటూరి గారు అభినందించారు.


    ఆ తర్వాత కెనడా – భారత దేశ భక్తి గీతాలు ఆలపించారు.. చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, ప్రధాన దాత గెట్ హోమ్ రియాలిటీ వారికి,  ఇతర దాతలకు, వీక్షించిన అతిథులకు తాకా కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి గారు వందన సమర్పణ తో కార్యక్రమాన్ని జయప్రదం గా ముగించారు.

    Also Read: ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?