Dr. Uma.R.Katiki (Aramandla) : నాయకత్వానికి, కరుణకు జీవన సాక్ష్యం డా.ఉమా.ఆర్.కటికి గారు.. గత పదిహేను సంవత్సరాలుగా ఉమాగారు సమాజానికి అందించిన నిస్వార్థ సేవకు, విద్యార్థులకు, ముఖ్యంగా మహిళా సాధికారతకు నిలబడిన తీరుకు మరో అవార్డు సత్కారంగా చేరింది. యునైటెడ్ పంజాబీస్ ఆఫ్ అమెరికా (UPA) నుండి ‘కమ్యూనిటీ లెగసీ’ అవార్డు లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం కేవలం మీ ఘనత మాత్రమే కాదు, సేవకు సరిహద్దులు లేవని నిరూపించే ఒక చారిత్రక సందర్భం. తెలుగు బిడ్డగా, పంజాబీ సంస్థ నుండి గౌరవం పొందడం మనందరికీ గర్వకారణం. వీరి కృషి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తూ, మీకు మరొక్కసారి అభినందనలు!
తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ గా చేస్తోన్న డా. ఉమా ఆర్. కటికి (ఆరమండ్ల) గారికి యునైటెడ్ పంజాబీస్ ఆఫ్ అమెరికా (UPA) ప్రతిష్టాత్మక ‘కమ్యూనిటీ లెగసీ’ (Community Legacy Award) అవార్డు లభించడం మనందరికీ గర్వకారణం. ఈ పురస్కారం కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, పదిహేనేళ్లుగా ఆమె సమాజం కోసం చేసిన అలుపెరగని, నిస్వార్థ సేవకు దక్కిన హృదయపూర్వక గౌరవం.

* నిస్వార్థ సేవ.. మానవత్వానికి ప్రతిరూపం
ఉన్నత విద్యావంతురాలు అయిన డా. ఉమా ఆర్. కటికి గారు తన జ్ఞానాన్ని, శక్తిని కేవలం వృత్తికే పరిమితం చేయకుండా.. తానా (TANA) వంటి సంస్థల్లో అనేక పదవులను అలంకరించి తెలుగు సమాజానికి విస్తృత సేవలు అందించారు. ప్రస్తుతం తానా స్టూడెంట్ కోఆర్డినేటర్ గా విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తూ, వారికి అండగా నిలబడుతున్నారు. గతంలో కల్చరల్ కోఆర్డినేటర్ గా, ఉమెన్స్ సర్వీస్ కోఆర్డినేటర్ గా ఎంతోమందికి బాసటగా నిలిచి అన్నార్థులై గొంతుకై నిలిచార. ఆ సమయంలో చేసిన విశేష కృషికి ఉమాగారికి ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కాయి.

* మహిళలకు నేనున్నానంటూ భరోసా
డా.ఉమా గారి సేవల్లో అత్యంత ముఖ్యమైనది.. హృదయానికి దగ్గరైన విషయం.. గతంలో మహిళా సాధికారత మరియు గృహహింసతో బాధపడే మహిళలకు అండగా నిలబడటం. తానా “చైతన్యస్రవంతి”లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి, మహిళలకు కేవలం తోడునీడగా ఉండటమే కాకుండా, వారిని శక్తిమంతులుగా మార్చడానికి అగ్రతాంబూలం ఇచ్చారు. వారి సమస్యలను విని, పరిష్కారం చూపడంలో ఆమె చూపిన కరుణ, దయ ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది.

“నాయకత్వం అనేది కేవలం ఒక హోదా కాదు, అది ఒక బాధ్యత. మనం కరుణతో నడిపించినప్పుడే శాశ్వత ప్రభావాన్ని సృష్టించగలం అని డా. ఉమా ఆర్. కటికి గారు నమ్ముతారు. అదే ఆమె సేవ రూపంలో చూపిస్తూ గొప్ప సేవావేత్తగా ఎదుగుతున్నారు.
డా.ఉమ గారికి ‘కమ్యూనిటీ లెగసీ అవార్డు’తో సత్కారం
యునైటెడ్ పంజాబీస్ ఆఫ్ అమెరికా నుండి ‘కమ్యూనిటీ లెగసీ’ అవార్డు తాజాగా డా.ఉమా.ఆర్.కటికి గారు అందుకోవడం ఆమె సేవలకు అద్దం పడుతోంది. పంజాబీ సంస్థ నుండి తెలుగు వ్యక్తికి.. సేవ హృదయం గల ఉమా గారికి ఈ గౌరవం దక్కడం, ఆమె సేవలు ప్రాంతీయ సరిహద్దులు దాటి విస్తరించాయని నిరూపిస్తుంది. ఈ పురస్కారం కోసం UPA సభ్యులు బ్రజ్ శర్మ జీ, అతుల్ వాహి జీ, రోసీ బాసిన్ , గురుప్రీత్ సింగ్ గార్లకు ఉమా గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు తన ఒక్కదానికే కాదని, తన ప్రయాణంలో సహకరించిన కుటుంబ సభ్యులు, మిత్రులు, వాలంటీర్లందరికీ చెందుతుందని ఆమె వినయంగా చెప్పారు.
* అపురూపమైన అవార్డులు.. అంకితభావానికి నిదర్శనం
డా. ఉమా.ఆర్. కటికి గారికి లభించిన ఈ అవార్డుల పరంపర ఆమె అంకితభావాన్ని, కృషిని చాటుతుంది.
ది ఉమెన్ ఆఫ్ అచీవ్‌మెంట్ అవార్డు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో – TAGC, 2024)
ది కాంగ్రెషనల్ అవార్డు (టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2024)
ఎన్.టి.ఆర్. శత జయంతి అవార్డు (2023)
నారీ అవార్డు (సూపర్ ఉమెన్ ఆఫ్ ది డికేడ్ 2010-2020 – 2021)
ఇండియా వరల్డ్ రికార్డ్ (‘అమ్మ నీకు వందనం’ కోసం – 2020)
ఐక్యాన్ అవార్డు (బెస్ట్ కమ్యూనిటీ ప్రమోటర్ – 2017)
ఉమెన్ సర్వీసెస్ , కల్చరల్ సర్వీసెస్, ఇప్పుడు ఎన్నారై స్టూడెంట్స్.. ఇలా కమ్యూనిటీ సర్వీసుల పట్ల డా. ఉమా గారు చూపిన నిబద్ధత, సేవే ఈ అవార్డులన్నింటికీ మూలం. ‘కమ్యూనిటీ లెగసీ’ అవార్డుతో ఆమె సేవలు మరింత మందికి స్ఫూర్తినిస్తాయని ఆశిద్దాం. డా. ఉమా గారికి మన హృదయపూర్వక అభినందనలు!