TANA – Lead the path ఆధ్వర్యంలో వివిధ దేశాల అనాథ పిల్లల కోసం meals packing లో పాల్గొన్న డా. ఉమా.ఆర్. కటికి మరియు వాలంటీర్లు.

మొదటిసారిగా చాలా మంది తానా వాలంటరీ ఈవెంట్‌కి చిన్న పిల్లలు సైతం ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణం అన్నారు. పేదలకు సాయం చేసేందుకు వారు రావడం నిజంగా గొప్ప విషయమన్నారు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసిన వలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Written By: NARESH, Updated On : May 23, 2024 11:29 am

Dr. Uma.R.Katikiతోపాటు వాలంటీర్లు

Follow us on

TANA – Lead the path – Dr. Uma.R.Katiki : ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్నారు స్వామి వివేకానంద. ఆయన బాటలో పయనిస్తున్నారు తానా కల్చరల్‌ సర్వీస్‌ కోఆర్డినేటర్‌ Dr.ఉమా.ఆర్‌.కటికిగారు. మన కోసం మనం జీవించడం అందరూ చేసే పనే కానీ, ఇతరుల కోసం జీవించడంలోనే ఆత్మ సంతృప్తి ఉంటుదని నమ్మి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు లేనివారు.. ఉన్నా ఆదరణకు నోచుకోనివారు ఎంతో మంది ఆశ్రమాల్లో ఉంటూ కన్నవారి ప్రేమకు దూరమై బ్రతుకుతారు . అర్ధాకలితో అలమటి స్తారు .ఇటీవలే మాతృ దినోత్సవం సందర్భంగా Dr .ఉమా అలాంటి ఒక స్థానిక women’s shelter వారికి కావలిసిన ఆహార పదార్థాలు, వస్తువులు మరియు నగదు రూపేణా సహాయం అందజేశారు.

వివిధ కరవు బాధిత దేశాల్లోని పిల్లల ఆకలి తీర్చే ఫీడ్ మై స్టార్ట్వింగ్ చిల్డ్రన్ అని ఒక సేవా సంస్థ ఇక్కడ ఉంది.
తాజాగా ఈ కార్యక్రమంలో తానా కల్చరల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉమా.ఆర్‌.కటికి గారు లీడ్‌ ది పాత్‌ ఫౌండేషన్‌తో కలిసి వారికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు. తనతో కలిసి వచ్చే మహిళలు, వలంటీర్లతో కలిసి ఈ ఫుడ్ ప్యాక్ చేసే సేవలో పాల్గొన్నారు. వారి కోసం దాదాపు 21,168 మీల్స్ ప్యాకేజింగ్ నిర్వఘ్నంగా పూర్తి చేసి వివిధ దేశాలకు (Ghana, Nicaragua, Philippines, Burkina, Angola, Faso etc) పంపే క్రతువులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమా.ఆర్‌.కటికితో కలిసి అనాథ పిల్లలకు సాయం చేసేందకు వచ్చిన పలువురు మహిళలు తమ అనుభూతిని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో డా.ఉమా.ఆర్.కటికితోపాటు లక్ష్మీ బెల్లంకొండ, గౌరీ అద్దంకి, ప్రణతి త్రిపుర, రాధిక గరిమెళ్ల, స్వాతి బండి, సుహాసిని, అనీష్ బెల్లంకొండ, శ్రీదేవి దొంతి తదితరులు పాల్గొన్నారు.


-మర్చిపోలేని అనుభూతి..

కార్యక్రమం అనంతరం ఉమా.ఆర్‌.కటికిగారు మాట్లాడుతూ ప్రపంచంలోని అనాథ పిల్లల కోసం ఆహారం సేకరించే కార్యక్రమం FMSC (ఫీడ్‌ మై స్టర్వింగ్‌ చిల్డ్రన్‌) విజయవంతమైందన్నారు. అనాథ పిల్లలకు అండగా ఉండేందుకు ఏకం గా 115 మంది వాలంటీర్లు హాజరై అబ్బురపరిచారన్నారు. ముందుకు వచ్చారని తెలిపారు. ఇది ఒక మర్చిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు. మొదటిసారిగా చాలా మంది తానా వాలంటరీ ఈవెంట్‌కి చిన్న పిల్లలు సైతం ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం గర్వకారణం అన్నారు. పేదలకు సాయం చేసేందుకు వారు రావడం నిజంగా గొప్ప విషయమన్నారు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసిన వలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


-ప్రత్యేక ప్రార్థన…
ఈ సందర్భంగా తానా, లీడ్‌ ది పాత్‌ సభ్యులు ఫుడ్ ప్యాకింగ్ అనంతరం కాశీ అన్నపూర్ణాష్టకం కూడా పఠించటం అందరినీ ఆకట్టుకుంది.