Indian Americans
America: అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో అనేక దేశాల నుంచి అధినేతలు వేడుకకు హాజు కాబోతున్నారు. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఉత్తర అమెరికాకు వలస వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పుడిదే చర్చనీయాంశమైంది. పాలనలో మార్పు నేపథ్యంలో భారతీయు ఆలోచనా విధానంలోనూ మార్పు కనిపిస్తోంది. అమెరికా వెళ్లే భారతీ విద్యార్థుల సంఖ్లో 30 శాతం క్షీణత కనిపించిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా ట్రంప్ పాలనపై ప్రపంచ దేశాలకు ఉన్న ఆలోచన, అంచనా మేరకే భారతీయులు అమెరికా వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర అమెరికాలోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలైన అమెరికా, కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల నమోదులో ఈ ఏడాది గణనీయమైన తగ్గుదల కనిపించిందని అంటున్నారు. గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీల్లో ప్రధానంగా కఠినమైన ఇమ్మిగ్రేషన్స్ ఒకటి. ఇది భారతీయులతోపాటు అమెరికా వెళ్లే ప్రపంచ దేశాల్లోని విద్యార్థుల ఆందోళనకు కారణం. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు.
ఏటా లక్షల మంది విదేశాలకు..
వాస్తవానికి 2023 నుంచి విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. అమెరికాకు 2.69 లక్షల మంది, కెనడాకు 4.27 లక్షల మంది వెళ్లారు. అయితే ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 30 శాతం క్షీణత కనిపిస్తోంది. కెనడా కఠిన నిర్ణయాల కారణంగా ఆ దేశానికి వెళ్లేవారు 60 శాతం తగ్గిపోయారు.ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతీయుల చూపు యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియావైపు పడింది. ఫ్రాన్స్, స్వీడన్ వంటి యురోపియన్ దేశాలు కూడా ఈ ఏడాది విదేశీయుల రాకను పెంచుతున్నాయి.