Homeప్రవాస భారతీయులుArati Prabhakar: వైట్‌హౌస్‌కు ఏఐని పరిచయం చేసిన మహిళా ఎన్‌ఆర్‌ఐ.. ఎవరీ ఇంజినీర్‌!

Arati Prabhakar: వైట్‌హౌస్‌కు ఏఐని పరిచయం చేసిన మహిళా ఎన్‌ఆర్‌ఐ.. ఎవరీ ఇంజినీర్‌!

Arati Prabhakar: ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ శరవేగంగా విస్తరిస్తోంది. అన్నిరంగాల్లో దీని హవా కొనసాగుతోంది. దూసుకుపోతున్న ఈ సరికొత్త టెక్నాలజీని అమెరికా శ్వేతసౌధానికి పరిచయం చేసింది భారత సంతతి అమెరికన్‌ ఆరతి ప్రభాకర్‌. వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

ఎవరీ ఆరతి?
ఇంజినీర్‌ కమ్‌ సోషల్‌ వర్కర్‌ అయిన ఆరతీ ప్రభాకర్‌ భవిష్యత్తులో ఏఐ హవా గురించి వైట్‌హౌస్‌లో పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించారు. 2022లో ఆరతిని అధ్యక్షుడు జో బైడెన్‌ వైట్‌హౌస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ(ఓఎస్‌టీపీ) డైరెక్టర్‌ అండ్‌ సైన్స్‌ అడ్వైజర్‌గా నియమించారు. దీంతో ఆరతి ఈ అత్యున్నత పదవిలో పనిచేస్తున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు. ఆమె ఓస్‌టీపీ డైరెక్టర్‌గా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్సోవేషన్‌లకు సబంధించిన విషయాలపై అధ్యక్షుడికి సలహాలుఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

వైట్‌హౌస్‌లో అందించే సేవలు..
ఆర్టిఫీషియల్‌ ఇంటెలిసెన్స్‌(ఏఐ) నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో చురుగ్గా పాల్గొంటారు. ఆమె అక్కడ ఏఐ అపార సామర్థ్యాన్ని గుర్తించడమే కాకుండా దానివల్ల ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఆమె బైడెన్‌ పాలనకు సంబంధించిన ఏఐ భద్రత, గోప్యత, వివక్షను పరిష్కరించడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. నిజానికి ఆమె ఓవెల్‌ ఆఫీస్‌లో ల్యాప్‌టాప్‌ని ఉపయోగించి ప్రెసిడెంట్‌బైడెన్‌కి చాట్‌ జీపీటీ గురించి వివరించడంతోనే వైట్‌హౌస్‌లో దీని ప్రాముఖ్యత ఉందని బైడెన్‌ గుర్తించారు.

ఆరు నెలల్లోనే..
ఇక ఆరు నెలల్లోనే అధ్యక్షుడు బైడెన్‌ ఏఐ భద్రత, గోప్యత, ఆవిష్కరణలపై దృష్టిసారించేలా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ఏఐ కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐలో అమెరికన్‌ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడంతోపాటు వివక్ష నుంచి రక్షిస్తుంది. ఇక ఆరతి ఈ ఏఐ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సమగ్ర వ్యూహాలు, సలహాలు అందిస్తుంది.

ఆరతి నేపథ్యం ఇదీ..
ఢిల్లీలో పుట్టిన ఆరతి.. మేడేళ్ల ప్రాయంలో ఉండగానే ఆమె కుటుంబం అమెరికా వెళ్లింది. టెక్సాస్‌లోని లుబ్బాక్‌లో పెరిగారు. ఆమె ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. తర్వాత ఆప్లయిడ్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. దీంతో 1984లో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి అప్లయిడ్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన తొలి భారత సంతతి మహిళగా ఆరతి చరిత్ర సృష్టించారు. ఆమె డాక్టరల్‌ అధ్యయనాల అనంతరం వాషింగ్‌టన్‌ డీసీలో కాంగ్రెస్‌ ఫెలోషిప్‌ పూర్తిచేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version