Bahrain: బహ్రెయిన్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ మహిళ..

కాలాపత్తర్‌ నివాసి అయిన షాహీన్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాలనుకుంది. అదే సమయంలో షాహీన్, రాజేంద్రనగర్‌కు చెందిన గల్ఫ్‌ ఏజెంట్లు ఫాతిమా, యూనస్‌ను సంప్రదించింది.

Written By: Raj Shekar, Updated On : May 9, 2024 12:33 pm

Bahrain

Follow us on

Bahrain: గల్ఫ్‌ దేశం బహ్రెయిన్‌లో హైదరాబాద్‌కు చెందిన మహిళ చిక్కుకుపోయింది. దీంతో తన 34 ఏళ్ల కూతురు షాహీన్‌ బేగంను ఇండియాకు తీసుకురావాలని ఆమె తల్లి వేడుకుంటున్నారు. ఇందుకోసం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖ రాసింది. ఎంబీటీ నాయకుడు అమ్జెద్‌ ఉల్లా ఖాన్‌ సహాయంతో షాహీన్‌ తల్లి జులేకా బీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఓ వీడియో సందేశాన్ని కూడా ఎక్స్‌లో పోస్టు చేసి షేర్‌ చేశారు.

ఏం జరిగిందంటే..
కాలాపత్తర్‌ నివాసి అయిన షాహీన్‌ కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లాలనుకుంది. అదే సమయంలో షాహీన్, రాజేంద్రనగర్‌కు చెందిన గల్ఫ్‌ ఏజెంట్లు ఫాతిమా, యూనస్‌ను సంప్రదించింది. వారు ఆమెకు బమ్రెయిన్‌లో 130 దినార్‌(రూ.28,802) వేతనంతో పనిమనిషి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పారు. ఈమేరకు డబ్బులు తీసుకున్నారు.

విజిట్‌ వీసాసై పంపి..
అయితే ఏజెంట్లు షాహీన్‌ను 2024, మార్చి 15న విజిట్‌ వీసాపై ఒమన్‌లోని మస్కట్‌కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఆమెను హౌస్‌మెయిడ్‌ వీసాపై బహ్రెయిన్‌కు పంపించారు. బహ్రెయిన్‌లో ఆమెను మరొక ఏజెంట్‌కు కలిపించారు. షాహీన్‌కు మానసిక అనారోగ్యంతో ఉన్న వృద్ధ మహిళను చూసుకునే పని ప్పగించారు. అయితే ఆ వృద్ధ మహిళ తన కూతురును హింసిస్తోందని షాహిన్‌ తల్లి జులేకాబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

స్వదేశానికి తీసుకురావాలని..
దేశం కాని దేశంలో హింసకు గురవుతున్న తన కూతురును ఇండియాకు తీసుకురావాలనిఇ జులేకాబీ వేడుకుంటోంది. తన కూతురు అక్కడ సరైన తిండి కూడా పెట్టడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది. యజమాని పాస్‌పోర్ట్‌ లాక్కున్నట్లు తెలిపింది. ఈమేరకు విదేశాంగ శాఖ మంత్రికి లేఖను రాసింది. తనను రక్షించమని షాహీన్‌ కూడా ప్రభుత్వానికి విన్నవించింది.