Singapore: సింగపూర్‌లో తెలంగాణ వాసిని మింగేసిన సముద్రపు అలలు

పవన్‌ కొద్ది రోజుల క్రితమే ఉపాధి కోసం సింగపూర్‌ వెళ్లాడు. అక్కడ తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు.

Written By: Raj Shekar, Updated On : July 6, 2024 4:44 pm

Singapore

Follow us on

Singapore: సింగపూర్‌లో తెలంగాణ వాసి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. కోదాడ పట్టణానికి చెందిన చౌడవరపు పవన్‌ సింగపూర్‌లో శుక్రవారం తన సేనహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు అలల ఉధృతికి కొట్టుకుపోయి మృతిచెందాడు.

ఉపాధి కోసం సింగపూర్‌కు..
పవన్‌ కొద్ది రోజుల క్రితమే ఉపాధి కోసం సింగపూర్‌ వెళ్లాడు. అక్కడ తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో సరదాగా గడిపేందుకు స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ సముద్ర స్నానం చేస్తుండగా అలల ఉధృతికి పవన్‌ కొట్టుకుపోయాడు. స్నేహితుల అధికారులకు సమాచారం ఇవ్వగా వారు గాలించి మృతదేహం వెలికి తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు నెలల క్రితం తమిళనాడు వాసి..
ఈ ఏడాది మే 23న సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తి మృతిచెందాడు. అక్కడి వాటర్‌ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసన్‌ శివరామన్‌ విధి నిర్వహణలో భాగంగా ట్యాంకు క్లీన్‌ చేసేందుకు వెళ్లాడు. అందులో విషపూరిత వాయువులు పీల్చుకుని మరణించాడు.

Tags