Virginia
Virginia: అమెరికాలో భారతీయుల మరణాలు, ప్రమాదాలు, అదృశ్య ఘటనలు కొనసాగుతున్నాయి. వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నా.. రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తెలుగు సాఫ్ట్‌వేర్ పృథ్వీ మరణించాడు. తాజాగా భారత సంతతికి చెందిన ఓం అరవింద్(25) తప్పిపోయాడు. అతని ఆచూకీ కోసం ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పోలీసులు గాలిస్తున్నారు.
పది రోజులుగా కనిపించని అరవింద్..
ఓం అరవింద్ మే 7న ఉదయం 11 గంటలకు మనస్సాస్‌లోని సెంటర్ విల్లే రోడ్డు 7,200 బ్లాక్ నుంచి బయల్దేరాడు. పది రోజులు గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో అరవింద్ గురించి తెలిసిన వారు 703–691–2131 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.
మానసిక స్థితిపై ఆరా..
ఇదిలా ఉండగా పోలీసులు అరవింద్ మానసిక స్థితిపైనా ఆరా తీస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఏమైనా బాధపడుతున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అరవింద్ ఆకృతి, ధరించిన దుస్తులు, ఇతర వివరాలతో మీడియాలో కూడా ప్రకటనలు ఇస్తున్నారు. అరవింద్‌కు ఎవరైనా శత్రువులు ఉన్నారా.. ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అని కూడా ఆరా తీస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: A 25 year old indian man has gone missing in virginia
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com