UI Movie Collection: సినిమాలను ఇలా కూడా తీయొచ్చా..? అసలు ఇలాంటి ఆలోచనలు కూడా ఒక మనిషికి మెదడు లో వస్తాయా? అసలు ఇదేమి కాన్సెప్ట్ బాబోయ్ అని అనిపించే రేంజ్ సినిమాలు తీసే దర్శకులలో ఒకరు ఉపేంద్ర. రెండు దశాబ్దాలకు ముందే ఆయన 20 ఏళ్ళ తర్వాత యువత ఆలోచనలు ఎలా ఉంటాయో, అలా అలోచించి సినిమాలు తీసేవాడు. అప్పట్లోనే ఈ సినిమాలు కన్నడ చలన చిత్ర పరిశ్రమని ని ఒక ఊపు ఊపాయి. తెలుగు లో కూడా ఆయన సినిమాలకు అప్పట్లో మంచి రెస్పాన్స్ లు వచ్చాయి. ఉపేంద్ర, రా వంటి చిత్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో వంద రోజులకు పైగా థియేటర్స్ లో ఆడాయి. అలాంటి ఉపేంద్ర పదేళ్ల పాటు దర్శకత్వం కి దూరంగా ఉంటూ, ఇప్పుడు మరోసారి ఆయన డైరెక్టర్ గా మారి తీసిన చిత్రం ‘UI’. పాన్ ఇండియా లెవెల్ లో మొన్ననే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది.
విడుదలకు ముందు ఈ సినిమా ఉపేంద్ర మార్క్ అని టీజర్స్, ట్రైలర్స్ చూసినప్పుడే అందరికీ అర్థం అయ్యింది. ఆ మార్క్ కి తగ్గట్టుగా ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఉపేంద్ర సినిమా నుండి ఏదైతే అభిమానులు కోరుకుంటారో, అంతకు మించే ఈ చిత్రంలో ఉంది. ఆయన్ని అభోమనించే వాళ్ళు పూర్తిగా సంతృప్తి చెందారు. అందుకే మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు అదిరిపోయాయి. కన్నడ సినీ ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు కర్ణాటక రాష్ట్రం నుండి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఉపేంద్ర కి ఈ రేంజ్ వసూళ్లు గత పదేళ్లుగా లేవు. మొదటి రోజు ఈ రేంజ్ లో ఉంటే, రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయట. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి 16 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండవ రోజు మొదటి రోజు తో పోలిస్తే షోస్ పెరిగాయి, కలెక్షన్స్ కూడా బాగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో ఈ చిత్రానికి నిన్న బుక్ మై షో యాప్ లో ‘పుష్ప 2 ‘ ని మించిన రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. రెండు రోజులకు కలిపి ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. నిన్న మొన్నటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 చిత్రానికి పోటీ ఇచ్చిన సినిమానే లేదు. ఇప్పుడు ఆడియన్స్ కి ‘పుష్ప 2’ తర్వాత రెండవ ఛాయస్ గా UI చిత్రం కూడా నిల్చింది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.