కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు వెళుతున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామ శివారులోని తెలంగాణ పోలీసులు ఆయనను ఆపేసి ఏపీ భూభాగం వైపు నుంచి వెళ్లాలని సూచించారు. వాస్తవాలను పరిశీలించేందుకు వెళుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని అధికారులను ఉదయభాను ప్రశ్నించారు. నీటి వాటాలపై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదని విమర్శించారు.