https://oktelugu.com/

Uttar Pradesh: వరుడితో అమ్మాయికి నిశ్చితార్థం.. ఆమె కోసం వచ్చిన మరో యువతి.. సహజీవనం అంటూ లొల్లి.. వైరల్ వీడియో

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బులంద్ షహర్ అనే పట్టణం ఉంది. అక్కడ ఓ యువతి, యువకుడికి నిశ్చితార్థం చేయడానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం ఉంది.

Written By: , Updated On : March 7, 2025 / 12:22 PM IST
Uttar Pradesh (1)

Uttar Pradesh (1)

Follow us on

Uttar Pradesh: అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్.. ఓ ప్రైవేట్ హోటల్లో ఓ అమ్మాయికి, అబ్బాయికి నిశ్చితార్థం జరుగుతోంది. రెండు కుటుంబాలు ఆర్థికంగా స్థితిమంతమైనవే కావడంతో.. ఆ వేడుకను అత్యంత ఘనంగా జరుపుతున్నారు. కానీ అంతలోనే అక్కడ ఒక్కసారిగా రచ్చ జరిగింది. ఒక అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది.

Also Read: డ్రెస్సింగ్ రూంలో టెన్షన్.. హార్ధిక్ పాండ్యా నవ్వుకున్నాడట.. అదీ గట్స్ అంటే

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బులంద్ షహర్ అనే పట్టణం ఉంది. అక్కడ ఓ యువతి, యువకుడికి నిశ్చితార్థం చేయడానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం ఉంది. అబ్బాయి, అమ్మాయి ఇష్టాలు కనుక్కొని.. ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే నిశ్చితార్థం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సరిగ్గా ఆరోజు రానే వచ్చింది. ఓ హోటల్లో నిశ్చితార్థం నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. ఇరువైపుల కుటుంబ సభ్యులు ఆ కార్యక్రమానికి వచ్చారు.. కాబోయే వధువు, వరుడు చక్కగా ముస్తాబై వచ్చారు. పట్టు వస్త్రాలలో ఇద్దరు మెరిసిపోయారు. వేదిక వద్ద ఒకరికొకరు ఉంగరాలను మార్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అకస్మాత్తుగా ఒక అమ్మాయి వచ్చింది. అక్కడున్నవారు మొత్తం ఆమెను కాబోయే వధువు స్నేహితురాలు అనుకున్నారు. కానీ ఆమె వేదిక మీదికి ఎక్కి గొడవ చేసింది. ” నాకు అన్యాయం చేస్తావా. నాతో నాలుగేళ్లు కలిసి ఉన్నావు కదా.. నీకు ఇలా చేయడానికి మనసు ఎలా ఒప్పింది? కొంచెం కూడా నామీద నీకు జాలి కలగలేదా? నా ప్రేమ నీకు ఇంత చీప్ అయిపోయిందా.. కనీసం నాతో మాట వరస కూడా చెప్పలేదు. నాలుగు సంవత్సరాలు నీకు ఏమైనా కష్టం కలిగించానా? ఇబ్బంది కలిగించానా? లేదు కదా.. అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావని” ఆ అమ్మాయి ప్రశ్నించింది. అయితే మొదట్లో ఆ అమ్మాయి ప్రశ్నిస్తోంది నూతన వరుడినని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసి వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇద్దరమ్మాయిల మధ్య సహజీవనం

కాబోయే వధువు, వేదిక మీద గొడవ చేసిన ఆమె స్నేహితురాలు నాలుగు సంవత్సరాలుగా సహజీవనంలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్త స్నేహంగా.. అనంతరం ప్రేమగా మారింది. ఆ ప్రేమలోనే వారు కలిసి ఉండడం మొదలుపెట్టారు. గత నాలుగు సంవత్సరాలుగా వారిద్దరు కలిసే ఉంటున్నారు. నూతన వధువు తరఫున కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వేదిక మీద ఆ యువతీ నిలదీస్తుంటే నూతన వధువు మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె అడుగుతున్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పలేక తలమంచింది.. ఈ వ్యవహారం తేడాగా ఉండడంతో నూతన వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి అవ లక్షణాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పాడు. సడన్గా తన స్నేహితురాలు రావడంతో. . నిశ్చితార్థం ఆగిపోవడంతో ఆ నూతన వధువు కాస్త ఆ హోటల్ నుంచి బయటికి వెళ్లిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని బులంద్ షహర్ పోలీసులు చెబుతున్నారు.