Electricity Bill: నెల మొత్తానికి రూ. 5 మాత్రమే కరెంట్ బిల్.. ఏంటి ఇది నిజమా బాస్?

1940 నాటి ఓ విద్యుత్ బిల్ హల్చల్ అవడంతో ఇప్పుడు కూడా ఇదే విధంగా వస్తే బాగుండు కదా అనుకుంటున్నారు కొందరు. అయినా ఒక నెల మొత్తం కరెంట్ ఉపయోగిస్తే వచ్చే బిల్ కేవలం ఐదు రూపాయలు.

Written By: Swathi, Updated On : May 3, 2024 2:06 pm

Electricity Bill

Follow us on

Electricity Bill: కరెంట్ బిల్ వస్తుందంటే ఎంత వస్తుందో అని మీటర్ రీడింగ్ చేస్తున్నప్పుడు అక్కడే నిలబడి మరీ చూస్తుంటారు. ఫ్యాన్ కట్టేయండి. లైట్ ఆఫ్ చేయండి. టీవీ ఎక్కువ సేపు చూడవద్దు. ఫోన్ వాడవద్దు ఛార్జింగ్ కు బిల్ వస్తుంది అనే మాటలు మీ ఇంట్లో వినిపిస్తూ ఉంటాయా? అవును మరీ కరెంట్ బిల్ కు భయపడాల్సిందే. కానీ కేవలం ఒక నెల మొత్తానికి ఐదు రూపాయల బిల్ మాత్రమే వచ్చింది. ఏంటి కొందరికి లక్షలు వస్తున్నాయి అని వినడమే కానీ ఇంత తక్కువ బిల్ వచ్చినట్టు వినలేదే అనుకుంటున్నారా? అయితే ఓ సారి లుక్ వేయాల్సిందే.

మీరు విన్నది నిజమే కేవలం ఒక నెల మొత్తానికి కలిపి రూ. 5 మాత్రమే బిల్ వచ్చింది. కానీ ఇప్పుడు కాదండోయ్ 1940లో వచ్చిన బిల్ అది. అప్పటి బిల్ పిక్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. దీంతో వామ్మో ఒకప్పటి రేట్లు, ఇప్పటి రేట్లు పోల్చగలమా అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి పాత ఇంటి పన్నులు, పెళ్లి కార్డులు వంటివి వైరల్ అవుతుంటాయి. అదే విధంగా ప్రస్తుతం కరెంట్ బిల్ హల్చల్ అవుతుంది.

ఈ నేపథ్యంలో 1940 నాటి ఓ విద్యుత్ బిల్ హల్చల్ అవడంతో ఇప్పుడు కూడా ఇదే విధంగా వస్తే బాగుండు కదా అనుకుంటున్నారు కొందరు. అయినా ఒక నెల మొత్తం కరెంట్ ఉపయోగిస్తే వచ్చే బిల్ కేవలం ఐదు రూపాయలు. కానీ ఒకప్పుడు ఐదు రూపాయలకే ఎక్కువ వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు దీని విలువ దేనితో సమానం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ బిల్ బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రామ్ వే సీవో. లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థకు చెందినది. ఇక అక్టోబర్ నెలలో వచ్చింది ఈ బిల్. ఇందులో కేవలం 3 రూపాయల 10 పైసలు మాత్రమే కరెంట్ కు ఖర్చైంది. మొత్తం పన్నులతో సహా 5 రూపాయల 2 పైసలు వచ్చింది బిల్. ఇక్కడ మరో విషయం గమనించారా? అప్పట్లో బిల్ చేతితో రాసేవారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు నెలకు రూ. 5 అయితే ఇప్పుడు యూనిట్ రూ. 5 గా మారింది. మరి ఈ విషయం పై మీరు ఎలా స్పందిస్తారు?