Criminal Offence: సమాజంలో మంచివారు చెడ్డవారు రెండు రకాలుగా మనసులు ఉన్నారు. అయితే అమ్మాయిల భద్రత విషయంలో చెడ్డ వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు తప్పుడు పనులు చేస్తూ అమాయకులైన అమ్మాయిలను అరాస్మెంట్ చేస్తూ ఉంటారు. అమ్మాయిల భద్రత విషయంలో ఎన్నో రకాల చట్టాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయినా కొన్ని దారుణాలు ఆగడం లేదు. అయితే ఇటీవల కొన్ని చట్టాలను కఠిన తరం చేసి వారికి మరింత భద్రతను ఇచ్చేలా చూస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో భౌతికంగా లేదా మానసికంగా ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిన ఎదుటివారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు అవకాశాలు వచ్చాయి. అయితే ఈ చిన్న తప్పు చేసిన జైలుకు వెళ్లక తప్పదు అని లా అండ్ ఆర్డర్ చెబుతుంది. ఇంతకీ అది ఏంటి అంటే?
Read Also:
ఒక్క రాంగ్ కాల్.. ఆమె జీవితాన్ని కష్టాల్లో నెట్టింది!https://oktelugu.com/andhra-pradesh/vishaka-a-man-extorted-a-large-sum-of-money-from-a-woman-he-met-through-a-scam-call-518594.html
కొందరు ప్రేమ పేరుతో వేధిస్తూ ఉంటారు. మరికొందరు ఇంకా ఏదో కారణంతో అమ్మాయిల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ప్రేమ విషయంలో ఇద్దరి మనస్తత్వాలు కలిస్తే అది వేరే విషయం. కానీ ఎదుటివారికి ఇష్టం లేకపోయినా భౌతికంగా దాడులు చేస్తూ.. మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అన్ని కమ్యూనికేషన్స్కు మొబైల్ ప్రధాన వాహకంగా ఉంది. అందువల్ల అమ్మాయిల నెంబరు తెలుసుకొని వారిని ఇబ్బంది పెట్టే మెసేజ్లు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల తమకేమవుతుంది లే అని అనుకుంటారు. కానీ ఇవి కూడా ఇబ్బందుల్లో పడేసే అవకాశాలు ఉన్నాయి.
తాజాగా ఉన్న చట్టాల ప్రకారం అమ్మాయిల విషయంలో ఏ చిన్న అసభ్యకర లేదా సాధారణ మెసేజ్ పెట్టిన.. ఎదుటివారికి ఇష్టం లేకపోతే వారు క్రిమినల్ కేసు పెట్టి అవకాశం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా రాత్రి 11 గంటల తర్వాత ఎవరైనా అమ్మాయికి beautiful అని మెసేజ్ పెట్టిన వారిపై చర్యలు తీసుకునేలా చట్టాలు అందుబాటులోకి వచ్చాయి. నిన్నటి వరకు కేవలం అసభ్య పదజాలం.. లేదా వారిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం వల్ల మాత్రమే ఎదుటివారిపై చర్యలు తీసుకుని అవకాశముండేది. కానీ ఇప్పుడు వారిని పొగుడుతూ మెసేజ్ చేసిన అది నేరమే అవుతుంది. అలాంటి నేరాలు జరుగుతుండడం వల్ల వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చట్టాలు తీసుకువచ్చారు.
అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కొందరు న్యాయవాద నిపుణులు తెలుపుతున్నారు. అనవసరపు మెసేజ్లు చేయకుండా.. అనవసరపు ఇబ్బందులు పడకుండా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో తగిన జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అయితే ఎదుటివారికి ఇష్టమైతే అది కూడా వారితో జీవితాంతం కలిసి ఉండాలని అనుకున్న సమయంలోనే ఇలాంటి మెసేజ్లకు ఆస్కారం ఉంటుంది. తెలియని వారికి లేదా మీరంటే నచ్చని వారికి ఇలాంటి మెసేజ్ చేయడం వల్ల చిక్కులో పడే అవకాశం ఉందని న్యాయవాద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా కేవలం సైగల ద్వారా కూడా వారిని ఇబ్బంది పెట్టిన ఊచలు లెక్కించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు. అందువల్ల మొబైల్ నుంచి వాడే సమయంలో ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.