Tamil Nadu Record Polling: బెంగాల్లోలాగానే తమిళనాడులో కూడా రికార్డుస్థాయిలో పోలింగ్ జరిగింది. బెంగాల్లో 92 శాతానికిపైగా పోలింగ్ జరగగా, తమిళనాడులో 84.69 శాతం పోలింగ్ జరిగింది. ఇంత పోలింగ్ తమిళనాడు చరిత్రలోనే జరగలేదు. 2011లో జరిగిన ఎన్నికల్లో 78.29 శాతం పోలింగ్ జరిగింది. ఈసారి 84.69 శాతం జరిగింది. ఈసారి నాలుగ శాతం అధికంగా పోలింగ్ నమోదైంది.
బరిలో మూడు రాజకీయ పక్షాలు..
తమిళనాడు బరిలో సాధారణంగా డీఎంకే, ఏఐఏడీఎంకే(అన్నా డీఎంకే) మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. ఇక్కడి ఓటర్లు ఒకే పార్టీకి అధికారం కట్టబెట్టిన సందర్భాలు అరుదు. గతంలో ఒకసారి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే, మరోసారి జయలలిత నేతృత్వంలోని అన్నా డీఎంకే అధికారంలోకి వచ్చేవి. కానీ, 2011, 2016లో వరుసగా అన్నా డీఎంకే అధికారంలోకి వచ్చింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక జయలలిత పూర్తిస్థాయి పాలన చేయలేదు. అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక 2021లో డీఎంకేకు ప్రజలు పట్టం కట్టారు. ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్, దళిత పార్టీలతో కలిసి బరిలో ఉంది. ఇక అన్నా డీఎంకే, బీజేపీ, టీఎంకే మరో కూటమిగా పోటీలో ఉన్నాయి. ఈసారి కొత్తగా హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా పోటీలో నిలిచింది. ఈసారి ముక్కోణ పోరాటం జరిగింది. ఇక బెంగాల్, తమిళనాడుతోపాటు పాండిచ్చేరిలో 89.85 శాతం, అస్సాంలో 85.86 శాతం పోలింగ్ కూడా రికార్డు. ఈ భారీ ఓటింగ్ ప్రజాస్వామ్యంపై పెరిగిన నమ్మకానికి నిదర్శనం.
పెరిగిన పోలింగ్ ఎవరికీ అనుకూలం?
స్పెషల్ రివిజన్ తర్వాత ఓటరు సర్కుల నుంచి తొలగించినా పోలింగ్ పెరగడం పాలకులపై యువత, ప్రజల అసంతృప్తిని సూచిస్తోంది. చెన్నైలో డీఎంకే కోటాలో టీవీకే ప్రభావం పెరిగినట్లు ప్రచారం. అన్నాడీఎంకేలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన మద్దతు కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు ఎక్కువగా మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలింగ్ ఎటు మొగ్గిందన్న చర్చ జరుగుతోంది. చెన్నై డీఎంకేకు కంచుకోట. కానీ ఈసారి టీవీకే బద్దలు కొడుతుందని ప్రచారం జరుగుతుంది.
తమిళనాడులో వరుస రెండోసారి ఒకే పార్టీ గెలవకపోవటం చరిత్ర. జయలలిత అపూర్తి పదవీకాలం తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. పెరిగిన పోలింగ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్లీ మలుపు తిప్పనుందా అన్న చర్చ ఊపందుకుంది. టీవీకే ప్రజారాజ్యం లాంటి ఎదుగుదల ఆంధ్రప్రదేశ్ ప్రజారాజ్యం రీతిలో జరుగుతుందని విశ్లేషకులు అంచనా.