Sunil Gavaskar: భారత టెస్ట్ జట్టుకు శుభ్ మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించిన నేపథ్యంలో, మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ అతనికి ముఖ్యమైన సూచనలు చేశాడు. గవాస్కర్ అభిప్రాయం ప్రకారం, కెప్టెన్ గా గిల్ ప్రవర్తన చాలా కీలకం. జట్టులోని ఇతన ఆటగాళ్ల గౌరవాన్ని పొందాలంటే, కెప్టెన్ గా అతని ప్రవర్తన మరింత ముఖ్యమని గవాస్కర్ అన్నాడు. గిల్ కి కెప్టెన్సీ అనుభవం తక్కువగా ఉన్నప్పటికి, అతడి ప్రవర్తనతో జట్టులో గౌరవం పొందాలని సూచించాడు.