
రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఏప్రిల్ 27 నుంచి మే 31 వ తేదీ వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయం పై ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ అధికారులతో ఆదివారం జరిగిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.