
సీఎస్ సోమేశ్ కుమార్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమేశ్ కుమార్ ఏపీ కేడర్ వ్యక్తి అని చెప్పారు. సోమేశ్ ఏపీకి వెళ్లాలని క్యాట్ తీర్పు ఇచ్చినా ఆయనను సీఎం కేసీఆర్ సీఎస్ గా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి కేడర్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సోమేశ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నప్పుడు 8 సంవత్సరాలు సర్వీస్ వదిలేసి ప్రైవేటు కంపెనీల్లో పని చేశారు. ఆ 8 సంవత్సరాలను సర్వీస్ లో తొలగిస్తే ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఇవ్వడానికి చట్టం అనుమతించదు. అలాంటి సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ చీఫ్ సెక్రటరీని చేశాడని రేవంత్ విమర్శించారు.