
Prabhas Super Cop: బాహుబలి దెబ్బకు ఓవర్ నైట్ ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్ (Prabhas). ఆ తర్వాత కూడా వరుసగా ప్యాన్ ఇండియా మూవీలే చేసి దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన ‘సాహో’ సైతం తెలుగులో సరిగా ఆడకపోయినా.. హిందీ మార్కెట్ లో మంచి విజయాన్నే రాబట్టింది. తాజాగా అదే స్టోరీ రిపీట్ చేయనున్నట్టు తెలిసింది.
ప్రభాస్ మరో సినిమాకు అంగీకరించాడని.. ఈసారి సూపర్ కాప్ గా నటించబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ‘రన్ రాజా రన్’ వంటి చిన్న సినిమాతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) లో టాలెంట్ గుర్తించిన ప్రభాస్ అతడితో బాహుబలి తర్వాత ‘సాహో’ చిత్రాన్ని తీశాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ హాలీవుడ్ హీరోలా కనిపించాడు.
‘సాహో’ తర్వాత సుజీత్ సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారాడు. దీని తర్వాత ‘లూసీఫర్’ తెలుగు రిమేక్ కు దర్శకత్వం వహించడానికి రెడీ అయినా ఎందుకో చేజారిపోయింది. తీంతో ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ తో ఒక సూపర్ కాప్ మూవీ చేయాలని స్టోరీ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
సూపర్ కాప్ స్టోరీ లైన్ ను ప్రభాస్ కు వినిపించాడట సుజీత్. ఆ లైన్ బాగా నచ్చడంతో పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’, సలార్, ఆది పురుష్, ప్రాజెక్ట్ కే, చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాతే సుజీత్ సినిమా పట్టాలెక్కనుంది.