Fertility Problems: మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, పురుషులు అనే కాకుండా ఇద్దరిలో కూడా పిల్లలు పుట్టే సమస్య రోజురోజుకీ పెరుగుతుంది. పూర్వ కాలంలో అయితే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవడం, వ్యాయామం చేయడం వల్ల ప్రెగ్నెన్సీ విషయంలో సమస్యలు వచ్చేవి కావు. కానీ ఈ రోజుల్లో సరైన ఫుడ్ తీసుకోకపోవడం వీటికి తోడు మద్యం, ధూమపానం వంటివి సేవించడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది. అలాగే కొందరు ఆలస్యంగా వివాహం చేసుకోవడం కూడా పిల్లలు పుట్టరు. ఇలాంటి కారణాల వల్ల కూడా పిల్లలు పుట్టరు. ప్రస్తుతం చాలా మంది మహిళలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం సరిగ్గా చూసుకోరు. దీంతో పిల్లలు పుట్టే అవకాశాలు కోల్పోతున్నారు. తెలిసో తెలియక కొందరు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. వాటివల్ల సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఏయే తప్పుల వల్ల పిల్లలు పుట్టరో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
ఫాస్ట్ ఫుడ్
ఈ రోజుల్లో అందరూ కూడా బయట ఫుడ్‌కి బాగా అలవాటు పడ్డారు. ఇంట్లో చేసిన ఫుడ్ టేస్ట్ లేకపోవడం లేదా బయట ఫుడ్‌కి అలవాటు పడుతున్నారు. అందులోనూ ఫాస్ట్పుడ్కి ఈ మధ్య ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. సమయం సందర్భం లేకుండా ఎక్కువగా తింటున్నారు. వీటిని తినడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో కూడా పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయని అంటున్నారు.
బరువు పెరుగుట
బయట ఫుడ్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. దీంతో కొందరు ఊబకాయం సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఎక్కువ బరువు ఉన్నవారిలో 81 శాతం వరకు వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అధిక బరువు ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి. అమ్మాయిలు కూడా బరువు ఎక్కువగా ఉంటే గర్భం దాల్చడం కష్టం అవుతుంది. కాబట్టి రోజూ వ్యాయామం, యోగా వంటివి చేయాలి. అప్పుడే బరువు తగ్గుతారు. దీంతో పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి.
ల్యాప్‌టాప్
ప్రస్తుతం రోజుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోని చేసే వర్క్‌లు ఎక్కువగా చేస్తున్నారు. కనీసం వ్యాయామం కూడా చేయడం లేదు. బాడీకి శారీరక శ్రమ లేకపోయిన కూడా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాగే ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఎక్కువ సమయం పెట్టుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మద్యపానం
మద్యం సేవించడం, ధూమపానం తాగడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సిగరెట్ తాగితే పురుషుల్లో వీర్య కణాల నాణ్యత తగ్గిపోతుంది. అలాగే మహిళలు కూడా మద్యం సేవిస్తే గర్భం దాల్చడం చాలా కష్టం అవుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.