
నయనతార పెళ్లి.. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పెళ్లి పై పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఐతే, ఆ పుకార్లను ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టకుండా మొత్తానికి నయనతార తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే, నయన్ పెళ్లి వ్యవహారం పై ఇప్పటివరకు మీడియా హడావుడి చేయడమే తప్ప.. నయనతార నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
దాంతో ఆమె పెళ్లి నిజంగానే జరుగుతుందా ? లేక ఎప్పటిలాగే ఇది కూడా రూమర్ గానే ముగుస్తోందా అంటూ నెటిజన్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు నయనతార క్లారిటీ ఇచ్చింది. ‘స్టార్ విజయ్ టెలివిజన్’ కి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారి, నయనతార తన పెళ్లి గురించి మాట్లాడింది.
మరి నయనతార.. తన పెళ్లి గురించి ఏమి మాట్లాడింది అంటే.. ‘అవును, వచ్చిన వార్తలు నిజమే. ఇది అంటూ వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించి.. నా నిశ్చితార్థం రింగే. పెళ్లి కుమారుడు విగ్నేష్ శివనే. అయితే మా నిశ్చితార్థానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అందుకే ఇండస్ట్రీలో కూడా ఎవరికీ మా నిశ్చితార్థం గురించి తెలియదు.
😍😍😍 Lady SuperStar நயன்தாரா – நாளை காலை 10:30 மணிக்கு நம்ம விஜய் டிவில.. #LadySuperstarNayanthara #VijayTelevision pic.twitter.com/Ptatkl4yWz
— Vijay Television (@vijaytelevision) August 14, 2021
నిశ్చితార్ధానికి ఎవర్ని పిలవకపోవడానికి కారణం.. నాకు సంబరాలు చేసుకోవడం, పెద్దగా హడావిడి చేయడం లాంటివి ఇష్టం ఉండవు. అందుకే మా నిశ్చితార్థ వేడుకను సింపుల్ గా జరువుకున్నాం. ఇక పెళ్ళికి డేట్ ఫిక్స్ కాలేదు. కాకపోతే త్వరలోనే మా పెళ్లి ఉంటుంది. డేట్ కుదిరిన తర్వాత అందరికీ నేనే చెబుతాను. కచ్చితంగా నా ఫ్యాన్స్ కు నా పెళ్లి గురించి సమాచారం ఇస్తాను’ అంటూ సిగ్గు పడుతూ చెప్పింది నయనతార.