Modi- Mamata: బెంగాల్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అన్ని పథకాల్లో కోత పడుతోంది. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ ఓటమి చెందారు. పులి మీద పుట్రలా పాఠశాలల్లో నియామకాల కుంభకోణం వెలుగు చూసింది. ఇంకేముంది అదును చూసి మోదీ మమతను దెబ్బ కొట్టాడు. అసెంబ్లీ ఎన్నికల పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఫలితంగా జాతీయ రాజకీయాల నుంచి వెనుదిరిగే అవకాశం కల్పించాడు. రెండు రోజుల క్రితం మిథున్ చక్రవర్తి ఒక సంచలన ప్రకటన చేయడమే ఇందుకు ఊతం ఇస్తోంది. “38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బిజేపి తో కాంటాక్ట్ లో ఉన్నారు”. మిధున్ చక్రవర్తి సాధారణంగా ఇలాంటి ప్రకటనలు చేయడు. కానీ ఈసారి చేసిన ప్రకటన వ్యూ హత్మకం.
…
ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది
…
“ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. బెంగాల్ ప్రజలు చాలా కాలం నుంచి మమత నిరంకుశ పాలన మీద ఆగ్రహంతో ఉన్నారు. మమత రాక్షస పాలనలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లిం లకి మద్దుతు లభిస్తున్నది. పట్టపగలే అక్రమంగా బెంగాల్ లో చొరబడిన రోహింగ్యాలు పొలాలలో బాంబులు తయారుచేస్తున్నారు. రాజర్షి చాలా ఓపికగా ఇన్నాళ్ళు వేచి చూశారు. ఇప్పుడు తన ఖడ్గానికి పదును పెడుతున్నారు . రాక్షసి చేతులు నరకడానికి సిద్ధంగా ఉన్నారు”
ఇలా సాగింది మిథున్ చక్రవర్తి ప్రకటన. బహుశా మిథున్ వాడిన ‘’రాజర్షి ‘’ పదం మోడీని ఉద్దేశించే అనుకోవాలి. హఠాత్తుగా మిధున్ చక్రవర్తి తన స్వరాన్ని పెంచి చాలా ఘాటుగా మాట్లాడాడు.
..
కుంభ కోణం వెలుగు చూసింది ఇలా
…
ఈ నెల 22 న వెలుగు చూసిన వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ & ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ స్కూల్ టీచర్ల నియామకాల తాలూకు ₹45 కోట్లు, అవి తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కేబినెట్ మంత్రి పార్థో ఛటర్జీ దగ్గర దొరకడం దేశంలో సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో మిథున్ తీవ్ర పదజాలం తో మమతను దూషించాడు. కానీ తృణమూల్ కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బహుశా ఛటర్జీ నోరు విప్పితే ఎవరు జైల్లోకి వెళ్లాల్సి ఉంటుందో అనే భయం ప్రధాన కారణమనే ఆరోపణలు ఉన్నాయి. అయితే బెంగాల్లో ముందు ముందు జరగబోయే పరిణామాలకి ముందస్తుగా ఒక ‘’ప్రమాద గంట ‘ మిథున్ కొట్టాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2018 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ దాడులు నిర్వహించేందుకు అనుమతిని నిరాకరించాడు ఆ వెంటనే బెంగాల్లో మమత కూడా సీబీఐకి అనుమతి నిరాకరించింది. తరువాత కేంద్రం సుప్రీం కోర్ట్ లో సీబీఐ కి అనుమతి నిరాకరించడం మీద అప్పీల్ చేసింది. తరువాత సుప్రీం కోర్ట్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ చర్యలని తోసిపుచ్చుతూ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది.
ఈ నెల 22 న ప్రస్తుత పరిశ్రమల శాఖ మంత్రి పార్ధో చటర్జీ ఇంట్లో, అలాగే అతడి సన్నిహితుల ఇంట్లో మొత్తం ఇప్పటి వరకు ₹50 కోట్ల నగదు తో పాటు ₹2 కోట్ల విలువ చేసే 5 కిలోల బంగారం, ఇతర ఇళ్ల స్థలాల తాలూకు డాక్యుమెంట్స్ ను సిబిఐ, ఈడీ స్వాధీనం చేసుకున్నాయి.
…
విద్యా శాఖ మంత్రిగా పని చేసినప్పుడు
…
అంతకుముందు వెస్ట్ బెంగాల్ విద్యా శాఖ మంత్రిగా పార్థో చటర్జీ పని చేశారు. ఆ సమయంలో టీచర్లను రిక్రూట్ చేసుకునేందుకు లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ నగదు రూపంలోనే తీసుకొని వాటిని అంటే ₹22 కోట్లు తన ఇంట్లో, మిగతావి నటీమణి అర్పితా ముఖర్జీ ఇంట్లో దాచాడు. డబ్బు దొరకగానే తన ఇంటిని ఒక గోడౌన్ గా వాడుకున్నాడని అర్పితా ముఖర్జీ ఆరోపించడం గమనార్హం. ఈనెల 23 న పార్ధో చటర్జీ ని, అర్పిత ముఖర్జీ ని అరెస్ట్ చేయగానే వెంటనే విచారణ ప్రారంభించిన ఈడీ దాదాపు 10 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించేసరికి తన ఆరోగ్యం బాగలేదని కలకత్తాలోని కేకేఎస్ఎం హాస్పిటల్ లో చేరాడు. హాస్పిటల్ నుంచి నేరుగా మమతకి ఫోన్ చేస్తే ఆమె స్వీకరించలేదు. వరుసగా మూడో సారి ప్రయత్నించగా ఈ సారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా మెసేజ్ వచ్చింది. దాంతో చేసేది లేక చాలా కోపంగా మమతకు ఒక మెసేజ్ పెట్టాడు.
..
మెమో లో మమత నంబర్
..
సీబీఐ లేదా ఈడీ ఎవరినన్నా అరెస్ట్ చేసినప్పుడు మోమో లో అరెస్ట్ చేసిన వ్యక్తి తాలూకు ఎవరికయినా విషయం తెలియచేయాలనేది ఒక రూల్. దాని ప్రకారమే అధికారులు ఛటర్జీ ని అడిగారు. అయితే తాను మమత కి ఫోన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి మెమోలో ఆమె పేరు, ఫోన్ నంబర్ రాయించాడు. ఈ సంగతి తెలిసే మమత చటర్జీ ఫోన్ ని స్వీకరించలేదు. దీని వెనుక ఒక పాత సంఘటన ఉంది. 2014 లో శారదా చిట్ ఫండ్ కేసులో దర్యప్తు అధికారులు అప్పటి మమత కేబినెట్ మంత్రి మదన్ మిత్ర ని అరెస్ట్ చేశారు. అప్పుడు ఆరోగ్యం బాగలేదని ఇదే కేఎస్కేఎం హాస్పిటల్ లో మదన్ మిత్ర చేరాడు. అలా తన కస్టడీ కాలాన్ని దాదాపుగా 11 నెలలు హాస్పిటల్ లోనే హాయిగా ఒక కేబినెట్ మంత్రిగా దర్జాగా గడిపాడు. మదన్ మిత్ర హాస్పిటల్ లో ఉన్న 11 నెలలు అతడి రవాణా శాఖను మమత స్వయంగా నిర్వహించింది. మమత కావాలనే మదన్ మిత్రను మంత్రివర్గం నుంచి తీసివేయలేదు. ఇప్పుడు కూడా చటర్జీ అదే రీతిలో హాస్పిటల్ లో మంత్రి హోదాలో సకల సౌకర్యాలతో తన కస్టడీ కాలాన్ని వెళ్లదీయవచ్చని అనుకుని మమత కి ఫోన్ చేశాడు. కానీ మదన్ మిత్ర విషయంలో హై కోర్ట్ చివాట్లతో దిమ్మ తిరిగిన మమతకు ఇప్పుడు ఆ సీన్ గుర్తుకు వచ్చి చటర్జీ దూరం పెట్టింటి. ఏకంగా తృణమూల్ లోని అన్ని పదవులు, మంత్రివర్గం నుంచి తీసేసింది. ఛటర్జీ ని అరెస్ట్ చేయగానే మిధున్ చక్రవర్తి చేసిన ప్రకటనలో మొదటి వాక్యం ‘ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది’ అన్నదానికి అర్థం ఇదేనేమో!
..
ముందు నుంచి సిద్ధంగానే..
..
బెంగాల్ లో వరుస పరిణామాలతో సీబీఐ, ఈడీ అధికారులు ముందు నుంచి చాలా సిద్ధంగా ఉన్నారు ఒక వేళ కేకేఎస్ఎం హాస్పిటల్ వైద్యులు కనుక ఇన్ పేషంట్ గా జాయిన్ అవ్వాలి అని రిపోర్ట్ ఇస్తే వెంటనే అక్కడి నుంచి తరలించి, దాని కంటే అత్యాధునిక సౌకర్యాలు ఉన్న మిలటరీ హాస్పిటల్ లో జాయిన్ చేయాలి అని. బహుశా మమత నుంచి అన్యాపదేశంగా ఆదేశాలు కేకేఎస్ఎం హాస్పిటల్ వర్గాలకి రావడంతో చటర్జీ ఆరోగ్యంగానే ఉన్నారు అని సర్టిఫై చేసి సిబిఐ, ఈడీ అధికారులకు ఊరటనిచ్చారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ లో మమత తరువాత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నంబర్ టూ గా ఉండగా, తరువాత నంబర్ త్రీ గా చటర్జీ ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. అందువల్లే శారదా చిట్ ఫండ్ కేసులో మదన్ మిత్రా కి ఇచ్చిన సౌకర్యాలు లాగానే తనకీ అలాంటి సౌలభ్యం ఉంటుంది అని భావించిన పార్ధొ చటర్జీ కి భంగ పాటు మిగిలింది.
Also Read: India- West Indies: వెస్టిండీస్ ను మరోసారి వైట్ వాష్ చేయడమే టీమిండియా లక్ష్యమా?
..
ఆ నిర్ణయం వెనుక
…
మమత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా పెద్ద రహస్యం ఉంది.
వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా నగరం సైబర్ నేరాలకి కేంద్రం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు విదేశాలలో జరిగే సైబర్ నేరాలకి కేంద్ర స్థానం కలకత్తా నగరం అంటే నమ్మాల్సిందే.
రోజుకి కలకత్తా కేంద్రంగా జరిగే సైబర్ నేరాల వల్ల జమ కూడే మొత్తం ₹3 వేల కోట్లు.
రోజుకి మూడు వేల కోట్ల రూపాయల నేరాలు జరుగుతుంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం చూస్తూ ఊరుకుంటుందా ? పోలీసులకి ఈ విషయం తెలియకుండా ఉంటుందా ? ఇక్కడ ముఖ్యమయిన విషయం ఏమిటంటే చటర్జీ ఇంట్లో దొరికిన డబ్బు, బంగారం అనేవి చిన్న చేపలు లాంటివి. చటర్జీ తన స్వంత దస్తూరితో రాసుకున్న డైరీ కూడా సిబిఐ /ఈడీ అధికారులకి దొరికింది. ఆ డైరీ లో దాదాపుగా 18 పేజీల నిండా వేల కోట్ల రూపాయల దందా తాలూకు సమాచారం ఉంది. పేర్లు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంటు, దొంగ వ్యాపార వివరాలు తెలియచెప్పే సమాచారం ఆ డైరీలో ఉంది. చటర్జీ ఇంట్లో దొరికిన డబ్బు బంగారం ఒక పెద్ద వ్యానులో తరలించాల్సి వచ్చింది. కానీ ఆ డైరీలోని 18 పేజీలలో ఉన్న సమాచారం మాత్రం వేల కోట్ల రూపాయల కి సంబంధించినది.
నేను ప్రధాని అభ్యర్ధిని అంటూ తోటి ప్రతిపక్ష నాయకులతో అహంకారంగా వ్యవహరిస్తూ వచ్చిన మమత ఇప్పుడు బెంగాల్ వరకు తన పరపతిని కోల్పోకుండా కాపాడుకోవడానికి తన సమయం వెచ్చిస్తున్నారు. ఇంకా మోదీ లిస్ట్ లో ఎంత మంది దేశ్ కీ నేతలు ఉన్నారో!
Also Read: Nandamuri Hero: సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నందమూరి హీరో