Mahakumbh Mela 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ.. 65 కోట్ల మంది 45 రోజుల్లో ఓకే చోట కలిసిన సంఘటన.. దాదాపు అమెరికా జనాభాకు రెండింతలు.. ఇక్కడికి వచ్చినటువంటి జనాభాతో సమానం.. ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. ఇన్ని కొట్లాది మందిని ఆర్గనైజ్ చేయగలిగారు. ఇంత కోట్ల మంది ప్రశాంతంగా ఇంటికి వెళ్లగలిగారు. ఇన్ని కోట్ల మందికి వసతులు ఎలా కల్పించారు. దీన్ని ఎలా నిర్వహించారు.
మహాకుంభమేళ వెళ్లివచ్చిన వారిని ఎవరిని అడిగినా వారి అనుభూతి వేరుగా ఉంది. భక్తుల్లో భక్తి పారవశ్యం నెలకొంది. ఈ అతిపెద్ద పండుగ వెళ్లినవారు జీవితంలో ఏదో సాధించినట్టుగా ఫీల్ అవుతున్నారు. ప్రతి మానవుడు ఇక్కడ సమానమే.. వెళ్లి అక్కడ త్రివేణి సంగమంలో మునగడానికే వెళుతున్నారు. ప్రజానీకం పూజలు కూడా చేయలేదు. వెళ్లి మునిగి వచ్చారు. ఇదొక వింత అనుభూతి.
21వ శతాబ్ధంలో ఇంత మంది ఇక్కడ మునగడం ఒక పెద్ద టాస్క్ . ఏఐ, సీసీ కెమెరాల సహాయంతో ఇన్ని కోట్ల మంది వచ్చారని లెక్కలు తేల్చారు. 45 రోజులు ప్రయాగ్ రాజ్ ప్రజలు ఈ జనతాకిడిని ఓర్చుకున్నారు. వారికి అసౌకర్యం కలిగినా వారి ఓపికకు ధన్యవాదాలు.. ప్రయాగ్ రాజ్ ఎయిర్ పోర్ట్ కు ఐదున్నర లక్షల మంది వచ్చారట..
మహాకుంభ్ అయిపొయింది ప్రయాగ్ రాజ్ ఖాళీ అయ్యింది .. దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు