Long Distance Rail: దేశంలో చాలామంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో సురక్షితంగా ప్రయాణించవచ్చని రైలు ప్రయాణానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దగ్గర అయిన, దూరం అయిన సమయం ఉంటే మొదటి ప్రాధాన్యత రైలు ప్రయాణానికే ఇస్తారు. అయితే దేశంలో ఎన్నో రకాలు రైళ్లు ఉన్నాయి. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఎవరి బడ్జెట్‌కు తగ్గట్లుగా రైలు ప్రయాణాల్లో సౌకర్యాలు ఉంటాయి. కనీసం నెలకి ఒకసారైన ప్రతి ఒక్కరూ ఏదో పని మీద బయటకు వెళ్తుంటారు. ఈరోజుల్లో చాలామంది తరచుగా బయట ట్రిప్‌లకు వెళ్తుంటారు. దీంతో టైన్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే బస్సు అయితే లేటు అవుతుంది. పోని ఫ్లైట్‌కి అయితే తొందరగా వెళ్లవచ్చు. కానీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చులో అన్ని చుట్టేసి రావాలని ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణం చేయడానికే ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా కొందరికి దూర ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. అయితే ఏ రైలు అయిన ఒకటి లేదా రెండు రోజులు ప్రయాణిస్తుంది. దూరం కూడా మహా అయితే ఒక వెయ్యి కిలో మీటర్ల వరకు ఉంటుంది. కానీ దేశంలో ఓ రైలు అత్యధిక దూరం ప్రయాణిస్తుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు రోజులు ఈ రైలు ప్రయాణిస్తుంది. అసలు ఈ రైలు పేరు ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మొత్తం ఎన్ని కిలో మీటర్లు ప్రయాణిస్తుందో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదివేయండి.
మన దేశంలో అన్ని ఎక్కువ దూరం వివేక్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తుది. ఈ రైలు అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్తుంది. మొత్తం 9 రాష్ట్రాల మీదుగా 4273 కిలో మీటర్లు ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ రైలు మొత్తం 56 స్టేషన్లలో ఆగుతుంది. 2013లో ప్రారంభించిన ఈ రైలు మొత్తం నాలుగు రోజులు ప్రయాణిస్తుంది. దీన్ని స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా ప్రారంభించారు. ఆయన గుర్తుగా వివేక్ ఎక్స్‌ప్రెస్ అని పేరు పెట్టారు. అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఈ రైలు ప్రారంభం అయి.. నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏపీలోని పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, విశాఖపట్నం, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట జంక్షన్ మీదుగా తమిళనాడులోకి వెళ్తుంది. ఆ తర్వాత సేలం, కోయంబత్తూర్ నుంచి కేరళ వెళ్లి కన్యాకుమారి వెళ్తుంది. ఈ రైలు దిబ్రూఘర్‌లో రాత్రి 7:25 గంటలకు స్టార్ట్ అవుతుంది. నాలుగో రోజు 11 గంటలకు ఈ రైలు కన్యాకుమారి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి కన్యాకుమారి వెళ్లడానికి ఏసీ టూ టైర్‌లో రూ.4450 టికెట్ ఛార్జ్ చేస్తారు. అదే త్రీ టైర్ అయితే రూ.3015, స్లీపర్ అయితే రూ.1185 చెల్లించాలి. ఎప్పుడైనా ఒక్కసారి లైఫ్‌లో ఈ నాలుగు రోజులు జర్మీ చేయాల్సిందే. ఎందుకంటే ఈ రైలు ప్రయాణించే లోకేషన్లు చాలా అందంగా ఉంటాయి.