Lakshmi Rai: ఈ డిజిటల్ సినీ ప్రపంచంలో అందాలకు.. అందమైన భామలకు.. అందాలను దాచుకోకుండా ప్రదర్శించే సుందరాంగులకు కొదవేమీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. తెలిసినా కొంతమంది ఎప్పుడు దరిద్రాలను, అలాగే ముష్టి ఫిలాసఫీలను, ఇక రోగాలను రొష్టులను ఎక్కువగా ఆకర్షిస్తూ సతమతమవుతూ ఉంటారు కాబట్టి.. వాళ్లకు ఇలాంటి అందాలను పట్టించుకోవాలనే కుతూహలం ఉండదు.

కానీ కొంతమంది కళాత్మక హృదయులు మాత్రం ఎప్పుడూ అందమైన అనుభుతులకు లోనవుతూ ప్రశాంతగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళెప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడూ అందమైనదే అని సంబర పడుతూ ఉంటారు. అందాల కోసం సరదాల కోసం వారు ఎప్పుడు వెతుకుతూనే ఉంటారు. అలాంటి వారి కోసమే జన్మనెత్తాను అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది లక్ష్మీ రాయ్.
ఈ భామకు సినిమాలు లేకపోయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఆ క్రేజ్ తోనే సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లో నటించింది, కానీ ఎవర్నీ మెప్పించలేకపోయింది. అందుకే, అదృష్టం వెతుక్కుంటూ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అమ్మడు నటనకు అక్కడ మేకర్స్ ఫిదా కాలేదు. దాంతో ఏమి చేయాలా ? అంటూ మొత్తానికి నానాపాట్లు పడుతుంది.
Also Read: ఆమె టాలెంట్ కి మేకర్స్ ఫిదా.. కానీ ఉపయోగం ఏముంది ?
సరే.. చివరకు ఏమి చేయలేక, క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ నెటిజన్ల మనసులను ఉల్లాస పరుస్తూ ముందుకు పోతుంది. ఎంతైనా ముదురు భామ అయినా ఈ జనరేషన్ భావాలు కలిగిన భామ కావడంతో.. అటు వెబ్ సిరీస్ లలోనూ తన సత్తా ఏమిటో గట్టిగా చూపించాలని తెగ ఉబలాట పడుతోంది. ఈ లోపు హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో విరుచుకుపడుతుంది.
తాజాగా వదిలిన ఫోటోలు చూస్తే.. బాటం లేకుండా.. వయ్యారం ఒలకపోస్తూ ఆధునిక ఖజురహో శిల్పం తరహాలో వగలు పోతూ మొత్తానికి ఈ భామ నిప్పులు రగిలిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ఈ భామ ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తోంది.