KCR Vs BJP: బీజేపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయిన కేసీఆర్!

KCR Vs BJP:  తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ తో పాటు ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక బాట పట్టనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి సిద్దమయ్యారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతున్నది. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు నువ్వానేనా? అంటూ పోటాపోటీగా ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కొత్తకొత్త ప్లాన్లు వేస్తున్నారు. […]

Written By: Raj Shekar, Updated On : March 12, 2023 10:30 am
Follow us on

KCR Vs BJP:  తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ తో పాటు ఆయన మంత్రి వర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక బాట పట్టనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి సిద్దమయ్యారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకు పెరిగిపోతున్నది. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు నువ్వానేనా? అంటూ పోటాపోటీగా ప్రచారం చేస్తూ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కొత్తకొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని స్కెచ్ వేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి రెడీ అయ్యారు. టైమ్ చూసి కర్ణాటకలో అడుగు పెట్టాలని చూస్తున్నారు.

నోటిఫికేషన్ వచ్చాకే..
కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనన్నాయి. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. జేడీఎస్ తరపున భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేతలు ప్రచారం చెయ్యడానికి పక్కాప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిికేషన్ ప్రకటించిన వెంటనే రంగంలోకి దిగడానికి బీఆర్ఎస్ నేతలు సిద్దం అవుతున్నారని తెలిసింది.

త్రిముఖ పోరు..
కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొనింది. జేడీఎస్ తో ఎంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న బీఆర్‌ఎస్‌కు జాతీయ పార్టీగా అవతరించేందుకు కర్ణాటకలో చక్కటి అవకాశం చిక్కింది. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హెచ్ డీ కుమారస్వామి గత ఏడాది డిసెంబర్ నుండి కర్ణాటకలో పంచరత్న రథయాత్ర నిర్వహించడం ద్వారా కర్ణాటకలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

బీఆర్ఎస్ కు ఆహ్వానం..
పంచరత్న రథయాత్రలో పాల్గొనాలని కుమారస్వామి బీఆర్ఎస్ నాయకులను ఆహ్వానించారు. అయితే వారు మాత్రం ప్రచారంలో పాల్గొనలేదని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉందని, బీఆర్ఎస్ నాయకులు కొన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని జేడీఎస్ పార్టీకి చెందిన మరి కొంతమంది నాయకులు అంటున్నారు.

బలగం వస్తే బీజేపీ కి కష్టమే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ నుంచి ప్రచారం చెయ్యడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కర్ణాటకకు వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత వరకు కేసీఆర్ ఎప్పుడు ప్రచారానికి వస్తారు అనే విషయంలో క్లారిటీ లేదని జేడీఎస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సుమారు 60 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని జేడీఎస్ నాయకులు అంటున్నారు. అంత మంది వస్తే అధికార బీజేపీకి ఇబ్బంది తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మోదీ ఎఫెక్ట్ తో బీజేపీ దూకుడు..
ఇక అధికార బీజేపీ ఢిల్లీ నుంచి అగ్రనాయకులను రంగంలోకి దింపుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు నాయకులు ఇప్పటికే కర్ణాకటకు వెళ్లి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలను రంగంలోకి దింపడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మిత్ర పక్షమైన జీడిఎస్ తరపున ప్రచారం చేయాలని గులాబీ బాస్ నిర్ణయించినారు. త్రిముఖ పోరులో విజయం ఎవరినివారిస్తుందో చూడాలి మరి!