Jio: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ ఉంటుందా.. దీనినే అమల్లో పెట్టి విజయవంతమయ్యారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. తన పరిచయాలతో.. తన స్టామినాతో ఏకంగా అంతరిక్షం కుంభస్థలాన్ని కొట్టి పడేశారు.. ఇక ఆ రంగంలోనూ నంబర్ వన్ గా ఎదిగేందుకు తహతహలాడుతున్నారు. కొత్త వ్యాపారాలను తెరపైకి తేవడంలో, అందులో నుంచి భారీగా లాభాలను ఆర్జించడంలో ముఖేష్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. అందువల్లే భారత దేశంలోనే అపర కుబేరుడిగా, ఆసియాలోనే శ్రీమంతుడిగా, ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద ధనవంతుడిగా కొనసాగుతున్నారు. చమురు శుద్ధి నుంచి సూపర్ మార్కెట్ల వరకు ముఖేష్ అంబానీ నిర్వహించని వ్యాపారం అంటూ లేదు. అలాంటి ముకేశ్ అంబానీ ఇప్పుడు ఏకంగా అంతరిక్షానికి గురిపెట్టారు.. అందులోనూ ఆయనకు పోటీ ఉంది. ఆ పోటీ ఆయన కంటే బలవంతులతో ఎదురైంది. అయినప్పటికీ ముఖేష్ వెన్ను చూపలేదు. చివరికి ఆయనే గెలిచాడు. దీనికి భారత ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేయడంతో, ముఖేష్ అంబానికి ఎదురే లేకుండా పోయింది.
ఇప్పటికే జియో ద్వారా టెలి కమ్యూనికేషన్ల సేవలో సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ.. శాటిలైట్ ఇంటర్నెట్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. శాటిలైట్ ఇంటర్నెట్ అంటే ఉపగ్రహాల ద్వారా డాటా సేవలు అందించడం.. అయితే ఈ విభాగంలో ఇప్పటికే టెస్లా అధినేత ఎలన్ మస్క్, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఉన్నారు. పలు దేశాలలో భారీగా పెట్టుబడులు పెట్టి సేవలు అందిస్తున్నారు. భారత్ లో ఇదే విధంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు.. అయితే ఈ రెండు సంస్థలను కాదని ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో ఉన్న జియోకు భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ అనుమతులు ఇచ్చింది. ఇదే విషయాన్ని రాయిటర్స్ వెల్లడించింది.. శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాలను చేయొచ్చు. మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేని గ్రామాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించవచ్చు. ఈ విభాగంలో భారీగా లాభాలు కళ్ల జూసే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద పెద్ద ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు రేసులో ఉన్నాయి. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని స్టార్ లింక్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆధ్వర్యంలో కైపర్ కంపెనీలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. ఈ కంపెనీలు భారత్ లో కూడా కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వచ్చాయి. వీటితోపాటు inmarsat కంపెనీ కూడా లైన్ లో ఉంది. అయితే ఈ కంపెనీలను కాదని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆర్థరైజేషన్ సెంటర్(IN – SPAce) ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని జియో, లక్సెం బర్గ్ కు చెందిన SES కంపెనీలకు ఏప్రిల్, జూన్ నెలలో ఆర్బిట్ కనెక్ట్ కు మూడు అనుమతులు ఇచ్చింది. ఫలితంగా భారతదేశంలో ఈ మూడు ఉపగ్రహాల ద్వారా ఆ కంపెనీలు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి.. అయితే టెలి కమ్యూనికేషన్ శాఖ నుంచి ఇంకా కొన్ని అనుమతులు లభించాల్సి ఉంది..
రాయిటర్స్ నివేదిక ప్రకారం స్టార్ లింక్, కైపర్, inmarsat కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు కోసం భారతదేశం మీద ఉపగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు పొందాయని IN – SPAce చైర్మన్ పవన్ గోయేంకా అన్నారు..” బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ మార్కెట్ వృద్ధిరేటు పెరుగుతోంది. వచ్చే ఐదు సంవత్సరాలలో 36% వృద్ధిని నమోదు చేస్తుంది. 2030 నాటికి ఇది 1.9 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని” పవన్ గోయేంకా అంచనా వేశారు. ఇక రిలయన్స్ జియో, లక్సెం బర్గ్ కు చెందిన SES కంపెనీలు సంయుక్తంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్లో జాయింట్ వెంచర్ నిర్వహిస్తున్నాయి. దీనికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అనుమతి ఇచ్చింది. ఆర్బిట్ కనెక్ట్ కు మూడు అనుమతులు ఇచ్చింది.
ఇక రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీ పలు రంగాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలలో సేవలను ప్రారంభించేందుకు పలు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలను కుదుర్చుకుంటున్నారు. ముకేశ్ అంబానీ చెందిన రిలయన్స్ 2000000 కోట్ల మార్కెట్ క్యాప్ తో భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా అవతరించింది. అతని చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలోని జియో ప్లాట్ ఫారం దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ ప్రారంభించేందుకు ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయి కంపెనీలు రేసులో ఉన్నప్పటికీ.. జియో కు అనుమతి రావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే జియో ద్వారా టెలికమ్యూనికేషన్ విభాగంలో సరికొత్త చరిత్ర సృష్టించిన.. ముఖేష్.. శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా కూడా మరిన్ని సంచలనాలను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Jio platforms gets permission to launch satellite internet in india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com