HomeNewsAP PRC: ప్లాన్లు అన్నీ ఫెయిల్.. పీఆర్సీ చిక్కుముడిలో జగన్.. బయటపడేనా?

AP PRC: ప్లాన్లు అన్నీ ఫెయిల్.. పీఆర్సీ చిక్కుముడిలో జగన్.. బయటపడేనా?

AP PRC: ఏపీ సర్కారుకు, ఉద్యోగుల మధ్య పీఆర్సీ ఫైట్ జరుగుతున్న సంగతి అందరికీ విదితమే. పీఆర్సీ విషయమై ఉద్యోగుల ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. ‘చలో విజయవాడ’ కార్యక్రమం సక్సెస్ కాగా, తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాల్సిందే అన్న డిమాండ్ తో వారు తర్వాత కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటున్నారు. ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి దిగబోతున్నారు. అయితే, జగన్ సర్కారు ఉద్యోగులపైన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ పీఆర్సీ పీటముడిలో చిక్కుకుపోకుండా ఉండేందుకుగాను జగన్ తనదైన వ్యూహాలను రచించుకుని, ఎత్తుగడల్లో మునిగిపోయారట.

AP PRC
AP PRC

జగన్ జనరల్ గానే ఏదేని సమస్య వచ్చినప్పుడు దానిని అలాగే ఉంచి మరో సమస్యను తెర మీదకు తెస్తాడని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తుంటారు. అలా జగన్ తనదైన శైలిలో సమస్యలను పరిష్కరిస్తాడని వైసీపీ శ్రేణులు భావిస్తుంటాయి. కానీ, ఈ పీఆర్సీ విషయంలో మాత్రం పరిస్థితులు అలా కనబడటం లేదు. పీఆర్సీ విషయమై గతంలో ఏపీ ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారనే భావన ఉండగా, ప్రస్తుతం అటువంటి భావన లేదని తెలుస్తోంది. గతంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పీఆర్సీ గురించి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రిత్యా ఉద్యోగులు సహకరించాలని, పెద్ద మనసుతో వ్యవహరించాలని కోరారు.

Also Read: కేసీఆర్ ను నమ్మి అనుభవించా.. జగన్ కుర్రాడు ఆ తప్పు చేశాడు.. నారాయణ సంచలనాలు

అలా సీఎం ఉద్యోగులను కోరిన క్రమంలో సహజంగానే సీఎంపైన ప్రజలకు కన్సర్న్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం ప్రజలు ఉద్యోగుల వైపు ఉన్నారనే చర్చ జరుగుతున్నది. తమకు గతం కంటే తక్కువ వేతనం వస్తుందన్న ఉద్యోగుల వాదనతో జనం ఏకీభవించే సీన్ ఉందని అంటున్నారు పలువురు. అయితే, ఏపీ సర్కారు ఈ క్రమంలోనే ఉద్యోగుల వెనుక రాజకీయ పక్షం ఉందనే వాదన తెరమీదకు తెచ్చే చాన్సెస్ ఉన్నాయి.

ఉద్యోగులవి గొంతెమ్మ కోరికలనే వాదన ప్రభుత్వం నుంచి ఉండగా, న్యాయమైన డిమాండ్లని ఉద్యోగులు అంటున్నారు. మొత్తంగా వాద, ప్రతివాదనలు దీటుగానే ఉంటున్నాయి. మొత్తంగా వివాదంలో అయితే జగన్మోహన్ రెడ్డి చిక్కుకుపోయారనే అభిప్రాయం అయితే ఉంది. జగన్ తనదైన శైలిలో ఉద్యోగులతో ఎలా డీల్ చేస్తారనేది ఇప్పుడు ముఖ్యమైన అంశంగా ఉంది. ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం కాకమునుపే ఉద్యమాన్ని ప్రభుత్వం చీల్చనుందా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Also Read: ఉద్యోగుల్లో చీలిక తెచ్చే దిశగా.. జగన్ సర్కారు ఎత్తుగడలివే..!

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular