Samantha (1)
Samantha: ఆ మధ్య మాయోసైటిస్ అనే వ్యాధికి గురైనట్టు.. దాని నివారణ కోసం చికిత్స పొందుతున్నట్టు సోషల్ మీడియాలో సమంత కొన్ని ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ తన కార్యక్రమాలలో బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు ఫోటోషూట్లతో సందడి చేస్తున్నారు. గ్లామర్ డోర్స్ పెంచి అభిమానులకు అందాల విందు అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం సమంత హాలీవుడ్లో మేరే హస్బెండ్ కి బీవీ(mere husband ki biwi) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటిస్తున్న నేపథ్యంలో సమంత ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బాలీవుడ్ కు ప్రధాన కేంద్రం ముంబై కాబట్టి.. అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత బిజీబిజీగా ఉంటున్నారు. అయితే రొటీన్ గా కాకుండా.. భిన్నంగా చేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావించారు. ఇందులో భాగంగా సమంతతో విచిత్రంగా సినిమా ప్రచార కార్యక్రమం చేపట్టారు.
ఆటోలో ప్రయాణించింది
మేరీ హస్బెండ్ కి బీవీ సినిమా ప్రచారంలో భాగంగా సమంత ముంబైలో ఆటో లో ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. అయితే సమంత ఆటోలో ప్రయాణించడంతో చాలామంది విభిన్నంగా వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు.. సమంత చేతుల్లో సినిమాలు లేవా? ఆమె ఆర్థిక పరిస్థితి అంతగా దిగజారిందా? కనీసం కారులో ప్రయాణించే స్తోమత కూడా లేదా? అంటూ ప్రశ్నలు సంధించారు. అయితే ఆ తర్వాత అసలు విషయం తెలిసి..ఓహో ఇది సినిమా ప్రచారమా అంటూ నాలుక కరుచుకున్నారు. ఐతే ఇటీవల స్టార్ హీరోయిన్లు తమ సినిమాల్లో ప్రచారం కోసం ఆటోలో ప్రయాణించడం పరిపాటిగా మారింది. ఇటీవల కీర్తి సురేష్ (Keerthi Suresh) తన నటించిన బేబీ జాన్(baby jhon) సినిమా ప్రచారం కోసం ఆ చిత్ర నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) తో కలిసి ఆటోలో ప్రయాణించింది.. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ అయింది. తమిళంలో హిట్ అయిన తేరీ సినిమాకు రీ మేక్ గా ఆ చిత్రం రూపొందింది.. అయితే ఇప్పుడు తన సినిమా కోసం ఆటోలో ప్రయాణించి సమంత కీర్తి సురేష్ దారిని అనుసరించింది. మరి ఈ సినిమా హిట్ అవుతుందా? లేదా? అనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. అన్నట్టు సమంత ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో రకరకాల హావభావాలను ప్రదర్శించింది. చలాకీగా ఫోజులిచ్చి అభిమానులను ఆకట్టుకుంది. సమంత ఆటోలో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.