Omelette VS Boild Egg: గుడ్డు వెరీ గుడ్డు అంటూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినాలని వైద్యులే సూచిస్తూ ఉంటారు. పిల్లలు, కొన్ని సందర్భాల్లో మహిళలు రోజువారి వంటకంలో గుడ్డు తప్పనిసరిగా ఉండాలని సూచిస్తూ ఉంటారు. అయితే చాలామంది గుడ్డు తినాలని ఆశతో ఆమ్లెట్ వేసుకుంటూ తింటూ ఉంటారు. కానీ వైద్యులు మాత్రం ఉడకబెట్టిన గుడ్డు తినాలని చెబుతూ ఉంటారు. బాయిల్డ్ ఎగ్ ను అవైడ్ చేస్తూ ఉంటారు. అసలు ఉడకబెట్టిన గుడ్డు తినడం మంచిదా? లేదా ఆమ్లెట్ తినడం మంచిదా? అనే వివరాల్లోకి వెళితే..
కోడిగుడ్డులో విటమిన్లతో పాటు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి12 ,విటమిన్ ఈ, వంటి విటమిన్లు ఉంటాయి. వీటితోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు కూడా లభ్యమవుతాయి. కోడిగుడ్లు మొత్తం 9 ఎమైనో ఆమ్లాలను కలిగి ఉండడం వల్ల ఇది పూర్తిగా పౌష్టిక ఆహారంగా పేర్కొనబడుతుంది.
గుడ్డు తినడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కండరాలు పటిష్టంగా ఉంటాయి. దీనిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ సరఫరా చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. గుడ్డులోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులను సైతం గుడ్డు పరిష్కరిస్తుంది.
అయితే గుడ్డు వల్ల ఆరోగ్యం అని తెలిసి చాలామంది ఆమ్లెట్ ను వేసుకొని తింటూ ఉంటారు. గుడ్డుతో ఆమ్లెట్ వేయడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. కానీ దీనిని వంట నూనెలు వంటి పదార్థాలను ఉపయోగించడం వల్ల కొవ్వు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రత ఉన్నవారికి ఇది నష్టాన్ని చేకరుస్తుంది. ఆమ్లెట్ వేసిన గుడ్డు అందరికీ ఆరోగ్యకరమైనది కాదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమ్లెట్ తినడం వల్ల జాండీస్ లాంటివి ఏర్పడతాయి.
అయితే ఉడకబెట్టిన గుడ్లు తినడం వల్ల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఇది ఎటువంటి నూనెలో వేయించనందున నాచురల్ శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉండడానికి ఉడకపెట్టిన గుడ్లే మేలు చేస్తాయి గర్భిణీ ఇలా సమయంలో మహిళలు ఉడకబెట్టిన గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. గుడ్డులో ఉండే పోషకాలతో ఐరన్ తో పాటు కాల్షియం ఎక్కువగా అందడం వల్ల బోన్స్ పటిష్టంగా ఉంటాయి. అలాగే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
అందువల్ల ఎక్కువ శాతం ఆమ్లెట్ కంటే ఉడకపెట్టిన గుడ్డికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ప్రతిరోజు వీలైతే ఉడకపెట్టిన గుడ్డును ఉదయం తీసుకోవడం ఉత్తమం. ఉదయం గుడ్డు తీసుకోవడం వలన రోజంతా యాక్టివ్ గా ఉంటారు. రోజువారి ఆహారంలో ఇది ఉండడం వల్ల అదనపు శక్తి అందుతుంది. సాయంత్రం అన్నానికి దూరంగా ఉండేవారు గుడ్డు తినడం వల్ల కడుపు నిండినట్లుగా ఉండి శక్తిని అందిస్తుంది.