Vijaya Sai Reddy : నువ్వు నేర్పిన విద్య అన్నట్టు ఉంది విజయసాయిరెడ్డి పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఏ సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులను వెంటాడారో.. ఇప్పుడు అదే సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఓ మహిళ అధికారి భర్త చేసిన ఆరోపణలతో విజయ్ సాయి రెడ్డి నిండా మునిగిపోయారు. గతంలో ఆయన హుందా రాజకీయాలు చేసి ఉంటే.. ఇవి కొట్టుకుపోయేవి. కానీ ఆయన గతంలో చేసిన రాజకీయం కారణంగా ఇప్పుడు ఆయనను వదిలి పెట్టేందుకు ప్రత్యర్థులు ఇష్టపడడం లేదు. ముఖ్యంగా టిడిపి, జనసేన శ్రేణులకు ఆయన టార్గెట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా, సోషల్ మీడియాలో తిట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. అతడిని వదిలిపెట్టే అరుదైన ఛాన్స్ వదులుకునే ప్రసక్తి లేదని ప్రత్యర్థులు తేల్చి చెబుతున్నారు.
విజయసాయి రెడ్డి ది వింత ప్రవర్తన. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులను వెంటాడేవారు. వేటాడినంత పని చేసేవారు. చిన్నా పెద్ద అన్న తారతమ్యం చూసేవారు కాదు. అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు కూడా వెనుకడుగు వేసే వారు కాదు. బిజెపి పెద్దల కోసం తన ట్విట్టర్ను సోషల్ మీడియా ఏజెన్సీలకు అప్పగించారంటే.. ఆయన ఏ స్థాయిలో రాజకీయాలు చేశారో అర్థమవుతుంది. అయితే ఎంతటి వ్యక్తికైనా గడ్డు రోజులు ఉంటాయి. ఇప్పుడు అదే గుడ్డు రోజులు విజయసాయిరెడ్డికి దాపురించాయి. సోషల్ మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లేవారు. ఇప్పుడు అదే బురద కాదు మురికి విజయసాయి రెడ్డికి అంటింది. దానిని కడుక్కోవాల్సిన అవసరం ఆయనపై ఏర్పడింది.
స్వయంగా సదరు ఉద్యోగిని భర్తే ఫిర్యాదు చేశారు. తప్పించుకోవడానికి వీలులేని వివరాలు అందులో పొందుపరిచారు. అందుకే సస్పెండ్ అయిన మహిళా అధికారితో ప్రెస్ మీట్ పెట్టించారు. సానుభూతి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. అది వారి కుటుంబ సమస్య అని మరిచిపోయి మీడియా ముందుకు తెచ్చారు. అయితే విజయసాయి రెడ్డి పై వచ్చిన ఆరోపణలతోనే.. నివృత్తి చేయాలన్న భావంతోనే ప్రెస్ మీట్ పెట్టించారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆ మహిళా అధికారిణి తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. తనకు పుట్టిన బిడ్డకు లాయర్ సుభాష్ కారణమని చెబుతున్నారు. మొదటి భర్తతో ఎప్పుడో విడిపోయామని చెప్పారని.. కానీ గత ఏప్రిల్ లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని పొంతన లేని.. నమ్మశక్యం కాని మాటలు చెప్పారు. ఓ కేసు విషయంలో సంప్రదించిన సమయంలో సుభాష్ పరిచయమయ్యారని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డిని ఎంపీ అనే కలిశానని.. ఆయన చాలా మంచివారు అని కితాబిచ్చారు. మాటల్లో పడి విశాఖ ప్రేమ సమాజం భూముల వ్యవహారాన్ని కూడా ఆమె బయట పెట్టారు.
సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్న వేళ స్పందించాల్సిన అవసరం విజయసాయిరెడ్డి పై ఏర్పడింది. అందుకే ఆయన ఇప్పుడు సడన్ గా ప్రెస్ మీట్ పెట్టేందుకు నిర్ణయించుకున్నారట. తన వెర్షన్ చెప్పనున్నారట. సాధారణంగా అయితే ఆరోపణలు చేసి సర్దుకునే అవకాశాలు ఉన్నాయి. మీడియా మీద ఏడ్చి వ్యవహారాలను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇందులో ఆ అధికారిణి భర్త తనపై వేసిన ఆరోపణలకు తప్పకుండా సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆరోపణ చేసిన భర్త డిఎన్ఏ టెస్ట్ కు రెడీ అవ్వాలని కోరితే.. విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటనేది తెలియాలి. తన తప్పు లేదనుకుంటే ఎంత దాకా అయినా వచ్చేందుకు విజయసాయిరెడ్డి రెడీ అవుతారు. కానీ సదరు వ్యక్తి కోరినట్టు స్పందించకపోతే మాత్రం తప్పు ఒప్పుకోవాల్సి ఉంటుంది.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలపైనైనా సోషల్ మీడియాలో స్పందించేవారు విజయసాయిరెడ్డి. తన హోదాను, వయస్సును పక్కనపెట్టి దారుణంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవే పరిస్థితులు తన దాకా వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆయనకు అర్థం అవుతోంది. అందుకే రాజకీయాల్లో ఉన్నవారు చాలా హుందాగా ప్రవర్తించాల్సి ఉంటుంది. లేకుంటే విజయసాయి రెడ్డికి వచ్చిన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి పై బురద పడడం లేదని.. ఏకంగా మురికి అంటుకుందని.. దానిని కడుక్కోవాల్సిన అవసరం అతడి పైనే ఉందన్న విషయాన్ని గ్రహించాలి.