https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అదనపు ఆదాయం పెరిగే అవకాశం..

ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అందువల్ల ఆచితూచి వ్యవహరించాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : December 17, 2024 / 08:23 AM IST

    Horoscope Today(3)

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశులపై ప్రభావం ఉండనుంది. ఇందులో భాగంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు కొత్త పెట్టుబడులు పెడితే జాగ్రత్తగా వ్యవహరించాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశివారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. బంధువుల నుంచి ధన సాయం అందుతుంది.

    వృషభరాశి:
    ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. అందువల్ల ఆచితూచి వ్యవహరించాలి.

    మిథున రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వ్యాపారులు ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.

    కర్కాటక రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే సమమంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు ఉంటాయి. సమయాన్ని వృథా చేయకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలి.

    సింహా రాశి:
    అనవసర ఖర్చులు ఉంటాయి. దీంతో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా శుభఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    కన్యరాశి:
    కుటుంబ సభ్యుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారు. భాగస్వాములతో చేసే చర్చలు ఫలిస్తాయి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    తుల రాశి:
    ఈరోజు ఆహ్లదంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.

    వృశ్చిక రాశి:
    కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. శారీరకంగా శ్రమ పెరుగుతుంది. ఇవి లాభిస్తాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తులను నమ్మొద్దు. రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

    ధనస్సు రాశి:
    విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు.

    మకర రాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొన్ని కొత్త పెట్టుబడులు పెడుతారు. ముఖ్యమైన పనులను వాయిదే వేయడమేమంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయినా మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    కుంభ రాశి:
    స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఇంటికి కొత్త అతిథులు రావొచ్చు. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. కొందరికి ప్రమోషన్ వచ్చే అవకాశం. వాహనాలపై ప్రయాణలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయం అవుతారు. అయితే వెంటనే వారిని నమ్మే అవకాశం లేదు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.