YCP: వైసీపీలో అభిప్రాయ భేదాలు రచ్చకెక్కుతున్నాయి. నేతల మధ్య పొసగడం లేదు. వారి మధ్య దూరాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది నేతల పరిస్థితి. ఒక్క చోట కాదు మొత్తం రాష్ర్టంలోనే నేతల మధ్య అగాధం ఎక్కువవుతోంది. ఒకరంటే మరొకరికి పడటం లేదు. దీంతో సమన్వయం కొరవడి కార్యక్రమాల నిర్వహణ కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రాజీకుదర్చాల్సిన వారు కరువయ్యారు. దీంతో వారి మధ్య మరింత దూరం పెరిగే ప్రభావాలే కనిపిస్తున్నాయి.

వచ్చే సాధారణ ఎన్నికలపై దీని ప్రభావం మరింతగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా నేతల్లో సహకారం లేకపోతే ప్రత్యర్థి పార్టీకి ప్లస్ అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో వైసీపీ గట్టెక్కే మార్గాలు తక్కువే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో పార్టీని గాడిలో పెట్టి నేతల్లో ఉన్న వైషమ్యాలు లేకుండా చేసే పనిలో నేతలు ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఎవరు కూడా వీటిపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే జనసేన తన బలం పెంచుకుంటోంది . కార్యకర్తలను ఉత్సాహపరిచి వచ్చే ఎన్నికలకు సిద్ధం చేస్తోంది. దీంతో టీడీపీ కూడా ఈషారి ఎలాగైనా అధికారం సాధించుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ కూడా ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుందని నేతలు భావిస్తున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేకుండా చేయాల్సిన బాధ్యతలను ఎవరికో ఒకరికి అప్పగించి అందరిలో సమన్వయం కలిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.
వైసీపీలో జరుగుతున్నపరిణామాలపై అధినేత దృష్టి సారించి దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. లేకపోతే విభేదాలు ఇలాగే పెరిగితే భవిష్యత్ లో మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఏర్పడనున్నాయి. వచ్చే రాజమండ్రి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కూడా అంత ఈజీ కాదనే విషయం గ్రహించాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి రాష్ర్ట పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.