
సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలలో చాలామంది విమాన ప్రయాణం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలా విమాన ప్రయాణం చేయాలని భావించే వాళ్లకు గో ఎయిర్ కంపెనీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే విమాన టికెట్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. విమానంలో ప్రయాణించాలని భావించే వారి కోసం ఈ సంస్థ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ ను తీసుకురావడం గమనార్హం.
ఇప్పటికే ఈ ఆఫర్ అందుబాటులోకి రాగా ఈ నెల 29వ తేదీలోపు విమాన టికెట్లను బుకింగ్ చేసుకోవాలని భావించే వాళ్లు ఈ ఆఫర్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు. రిపబ్లిక్ డే ఫ్రీడమ్ సేల్ పేరుతో గో ఎయిర్ సంస్థ ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. 859 రూపాయల నుంచి టికెట్ ధరలు ప్రారంభం కానున్నాయి. ప్రయాణించే మార్గాన్ని బట్టి టికెట్ ధరలలో మార్పులు ఉంటాయి. ఈ ఆఫర్ లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వాళ్లు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీలోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు.
అయితే ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలని భావించే వాళ్లకు ఒకవైపు ప్రయాణానికి మాత్రమే ఆఫర్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్లకు జీరో చేంజ్ ఫీజు ఫెసిలిటీ సౌకర్యం కూడా లభిస్తుంది. గో ఎయిర్ కంపెనీ టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్లకు ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తోంది.
ఏదైనా కారణాల వల్ల ప్రయాణ తేదీలను మార్చుకోవాలని భావిస్తే రెండు వారాల ముందు ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రోమో ఫేర్ సీట్లకు ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. గో ఎయిర్ వెబ్ సైట్ ద్వారా ఈ ఆఫర్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.