HomeNewsHurun India Rich List : ముఖేష్ అంబానీని వెనక్కు నెట్టి దేశంలోనే మొదటిస్థానానికి గౌతమ్...

Hurun India Rich List : ముఖేష్ అంబానీని వెనక్కు నెట్టి దేశంలోనే మొదటిస్థానానికి గౌతమ్ ఆదానీ.. భారతీయ బిలియనీర్ల లిస్ట్ ఇదే

Hurun India Rich List 2024: దేశంలో సంపాదనకు కొదువ లేదు. పేద వాడు పేదవాడిగానే ఉంటున్నాడు.. ధన వంతుడు మరింత ధనం పోగేసుకుంటున్నాడు. ఇది ఎప్పటికీ ఉండే వ్యత్యాసమే. భారత్ లో ఇద్దరు ప్రముఖ వ్యాపారులు వారి పేర్లను అగ్ర స్థానంలో నిలుపుకునేందుకు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు గౌతమ్ అదానీ, మరొకరు ముఖేశ్ అంబానీ భారత్ ఇటీవల విడుదల చేసిన ‘హురున్  రిచ్ లిస్ట్’లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. వారిలో గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఉన్నారు. అంటే ఈ జీబితా ప్రకారం.. గౌతమ్ అదానీ ఇండియాలో అత్యంత ధనవంతుడు అన్నమాట. ఆ తర్వాతి స్థానం ముకేశ్ అంబానీ తీసుకున్నారు. ఆ తర్వాత శివ్ నాడార్ ఉన్నారు. హురున్ రిచ్ లిస్ట్ 2024లో తొలిసారిగా 300 మందికి పైగా భారతీయ బిలియనీర్లు చోటు దక్కించుకోవడం విశేషం. 13 ఏళ్ల క్రితం విడుదల చేసిన జాబితాతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికం అని తెలుస్తుంది. హురున్ రిచ్ లిస్ట్ 2024 భారీగా పెరిగింది. 1,500 మందికి పైగా వ్యక్తులు రూ. 1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 150 శాతం అధికం. హురున్ ఇండియా మొత్తం 1,539 మంది సూపర్ ధనవంతులను గుర్తించింది. ఇది గతేడాదితో పోలిస్తే 220 శాతం పెరుగుదల. హురున్ రిచ్ లిస్ట్ 2024లో 1500 మందికి పైగా చేరారు. ఇది ఐదేళ్లలో 86 శాతం పెరిగింది. వీరి మొత్తం ఆస్తులు రూ. 1000 కోట్లకు పైగానే ఉంటాయి. బిలియన్ల కొద్దీ ఆస్తులతో 334 మంది బిలియనీర్లను తొలిసారిగా ఈ జాబితాలో చేర్చారు.

గౌతమ్ అదానీ నికర విలువ రూ. 11.6 లక్షల కోట్లు..
గౌతమ్ అదానీ (62), అతని కుటుంబం హురున్ రిచ్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన సంపద 95 శాతం పెరిగింది. అదానీ సంపద పెరుగుదల విషయంలో హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత గౌతమ్ అదానీ, అతని కుటుంబం ర్యాంకింగ్ లో అగ్రస్థానం పొందాయని నివేదిక పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఆయన సంపద 95 శాతం పెరిగి రూ. 11,61,800 కోట్లకు చేరింది.

అదానీ సంపద పెరగడానికి కారణం?
అదానీ సంపద గతేడాది నుంచి గణనీయంగా పెరిగేందుకు ముఖ్య కారణం గ్రూప్ షేరు ధర పెరగడమే ఉదాహరణకు.. అదానీ పోర్ట్స్ 98 శాతం వృద్ధిని చూపించింది. ఇది పెరిగిన నిర్వహణ సామర్థ్యాలు, రాబోయే అదనపు పోర్టులు, కంటైనర్ టెర్మినల్స్ కొనుగోలు షేరు దర పెరగడంలో తోడ్పడ్డాయి. ఇదే సమయంలో ఇంధన రంగ కంపెనీలైన అదానీ ఎనర్జీ, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్ షేర్లు 76 శాతం పెరిగాయి.

ముకేశ్ సంపద గురించి..?
ఈ జాబితాలో గౌతమ్ అదానీ తర్వాత ముకేశ్ అంబానీ ఉన్నారు. ముఖేశ్ మొత్తం ఆస్తులు రూ. 10,14,700 కోట్లు, ఇది గతేడాదితో పోలిస్తే సంపదలో 25 శాతం పెరుగుదల. హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్, ఆయన కుటుంబం రూ. 3,14,000 కోట్ల సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ప్రముఖ వ్యాక్సిన్ టైకూన్ సైరస్ ఎస్ పూనావాలా రూ. 2,89,800 కోట్ల ఆస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు.

హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, ప్రధాన పరిశోధకుడు అనాస్ రెహ్మాన్ జునైద్ దీని గురించి మాట్లాడుతూ కొత్త ముఖాలన్నీ టాప్ 20 సెక్టార్లలో చేరాయి. ఆసియాలో సంపద సృష్టి ఇంజిన్ గా భారత్! చైనాలో బిలియనీర్ల సంఖ్య 25 శాతం తగ్గగా, భారత్ లో 29 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో బిలియనీర్ల లిస్ట్ 334ను తాకింది.

2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో 58 ఏళ్ల బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ క్రికెట్ జట్టు, రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ లో ఖాన్ పెట్టుబడులతో ఆయనకు భారీ సంపద సమకూరింది. దీని తర్వాత, జూహీ చావ్లా, ఆమె కుటుంబం, హృతిక్ రోషన్, కరణ్ జోహార్ అమితాబ్ బచ్చన్ ఉన్నారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular