Mark Zuckerberg: మార్క్ జుకర్ బర్గ్.. ఈ పేరు చెబితే ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు గుర్తుకు వస్తాడు..మెటా కంపెనీ ఓనర్ మదిలో మెదులుతాడు. ప్రపంచంలో అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫాం పేస్ బుక్ ను ఏర్పాటు చేయడం ద్వారా మార్క్ జూకర్ బర్గ్ ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులలో ఒకరుగా ఆవిర్భవించారు. మెటా కంపెనీ ద్వారా మరిన్ని ప్రయోగాలను జూకర్ బర్గ్ చేస్తున్నారు. ఇకపై మరిన్ని చేయబోతున్నారు.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క విషయంలో తగ్గాల్సిందేనా..?అట్లీ, త్రివిక్రమ్ లలో ముందు ఎవరితో సినిమా చేస్తాడు..?
జూకర్ బర్గ్ ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో కేజ్ ఫైట్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పట్లో ఆయన తీసుకున్న శిక్షణ సంచలనంగా మారింది. ఇప్పుడు మస్క్ తనలో ఉన్న మరో టాలెంట్ ను బయటికి తీశాడు. తన భార్య ప్రిసిల్లా 40వ పుట్టినరోజు సందర్భంగా జంప్ షూట్ ధరించాడు. ప్రత్యేకంగా పాట పాడుతూ భార్యను ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ పాటలో ప్రిసిల్లా ను పొగుడుతూ.. ఆమె అందాన్ని ఆరాధిస్తూ జూకర్ బర్గ్ పాడిన పాట ఆకట్టుకుంటున్నది..” నువ్వు నా ప్రాణం.. నా త్యాగం నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నా ఆరాధ్య దేవత.. నీకు నా ప్రణామాలు..నాతో కలిసి ప్రయాణించిన నీ ఓపికకు ధన్యవాదాలు” అని అర్థం వచ్చేలా జూకర్ బర్గ్ పాడిన పాట ఆకట్టుకుంటున్నది.
ఈ కోణం కూడా ఉందా?
జూకర్ బర్గ్ కు నిమిషం కూడా తీరిక ఉండదు. ప్రపంచంలో అగర్బ శ్రీమంతుడిగా ఉన్న అతడు.. కొత్త కొత్త వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్నాడు. మెటా ద్వారా సరికొత్త వ్యాపార విస్తరణ ప్రణాళికలు చేపడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్న నేపథ్యంలో.. జూకర్ బర్గ్ ఉద్యోగులపై వేటు వేశాడు. తన సంస్థల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించాడు. అయితే వ్యాపార విస్తరణ విషయంలో మాత్రం జూకర్ బర్గ్ వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను మరింత విస్తృతంగా వినియోగిస్తూ సరికొత్త అనుభూతిని యూజర్లకు అందిస్తున్నాడు.. ఇక ఇప్పుడు తన భార్య పుట్టిన రోజు పాట పాడి ఆకట్టుకున్నాడు.. అంతేకాదు జంప్ సూటులో అలరించాడు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మార్క్ జుకర్ బర్గ్ ను పొగుడుతున్నారు. అంతేకాదు గాత్రంతో జస్టిన్ బీబర్ ను మించిపోయావని వ్యాఖ్యానిస్తున్నారు. ” డబ్బులు ఎలా సంపాదించాలో నిన్ను చూసి నేర్చుకోవాలి. అవకాశాలను ఎలా సృష్టించుకోవాలో నిన్ను చూసి తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు పాటగాడి అవతారం ఎత్తావు. మామూలుగా లేదు నీ గాత్రం. నువ్వు కనుక పాటలు పాడటం మొదలుపెడితే మామూలుగా ఉండదు. అందువల్లే నువ్వు వ్యాపారవేత్తగా మాత్రమే ఉండు. ఒకవేళ ఇలానే పాటలు పాడితే చాలామంది గాయకులకు ఉపాధి లభించకుండా పోతుంది. ఎందుకైనా మంచిది నువ్వు వ్యాపారం మీదనే దృష్టిపెట్టుకోవాలని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.
తన భార్య ప్రిసిల్లా 40వ జన్మదిన సందర్భంగా జంప్ సూట్ ధరించి పాటలు పాడిన ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. #MarkZuckerberg #facebook#MarkZuckerbergwife40thbirthdaycelebrations #pricilla40thbirthday pic.twitter.com/IDG9D1qKUk
— Anabothula Bhaskar (@AnabothulaB) March 1, 2025