
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ ను కార్యాలయానికి పిలిపించి విచారించింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణ జరిగిన సమయంలో అధికారులు కేకే సింగ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. సుశాంత్ సింగ్ బ్యాంక్ ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని… ఆ విషయం ఏ విధంగా తెలిసిందో కేకే సింగ్ చెప్పాలని అన్నారు.
కేకే సింగ్ ఈ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను అధికారులు రికార్డ్ చేశారు. ఇప్పటికే ఈడీ అధికారులు రేహా చక్రవర్తి, ఆమె సోదరుడు, సుశాంత్ మేనేజర్, సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ లను విచారించారు. ఈడీ వారి స్టేట్ మెంట్లను ఇప్పటికే రికార్డ్ చేసింది. కేకే సింగ్ కొన్ని రోజుల క్రితం రేయా చక్త్రవర్తి తన కొడుకుతో డేటింగ్ చేసిందని… తమ కొడుకు బ్యాంకు ఖాతాల నుంచి ఆమె కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీ జరిగింది.
ఈ కేసు దర్యాప్తు విషయంలో మహారాష్ట్ర, బీహార్ పోలీసుల మధ్య వివాదం జరుగుతోంది. సుశాంత్ మరణం కేసు దర్యాప్తును బీహార్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. అయితే మహారాష్ట్రలో జరిగిన ఘటనకు బీహార్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించటంపై మహారాష్ట్ర సర్కార్ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సుశాంత్ మరణం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెబుతోంది.