Digital Arrest: ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేటుగాళ్ల మాయ మాటలకు నమ్మి చాలా మంది డబ్బులు పొగోట్టుకుంటున్నారు. ప్రస్తుతం అందరూ అన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. బయటకు వెళ్లి కొనేంత సమయం లేక ప్రతీ ఒక్క దానికి కూడా ఆన్‌లైన్‌లో కొంటున్నారు. వీటిని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. పదివేలు పెడితే లక్ష పెట్టుబడి అని, బంపర్ ఆఫర్లు అని ఇలా కొత్త కారణాలతో ప్రజలను దోచుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. చాలా మంది ఈ డిజిటల్ అరెస్ట్ బారిన పడుతున్నారు. కేటుగాళ్ల మాయలో పడి దీని బారిన పడి లక్షల కొద్దీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే మనలో చాలా మంది ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు. మరి ఈ డిజిటల్ అరెస్టు అంటే ఏంటి? దీనిని నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్టు. దీన్ని ఉపయోగించి కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. అయితే మీకు ఏదో పార్సల్ వచ్చిందని, అందులో డ్రగ్స్, పాస్‌పోర్టు వంటివి ఉన్నాయని మిమ్మల్ని నమ్మిస్తారు. మీరు ఎలాంటి ఆర్డర్ పెట్టరు. కానీ మీరు పెట్టారని చెబుతుంటారు. ఎన్ని సార్లు చెప్పిన వినకుండా మిమ్మల్ని మాటలతో భయపెట్టిస్తారు. ఈ కేసు వల్ల మీరు జైలుకి వెళ్తారని, డబ్బులు కడితే సీబీఐ, ఈడీ అధికారులు మిమ్మల్ని సంప్రదించి కేసు డీల్ చేస్తామని అంటారు. కేసు, జైలు అనేసరికి భయపడి, డబ్బులు కట్టడానికి రెడీ అవుతుంటారు. ఇలా ఆన్‌లైన్‌లో బెదిరించి డబ్బులు కేసు డీల్ చేస్తామని డబ్బులు తీసుకుంటారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. ప్రస్తుతం ఈ డిజిటల్ అరెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయి. రోజురోజుకీ ఈ నేరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొత్త నంబర్ల నుంచి కాల్ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల బారిన ప్రజలు పడకుండా ఉండాలని ప్రభుత్వం ఎన్నో సూచనలు చేస్తోంది. అలాగే వీటిని అరికట్టేందుకు 1930 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా తీసుకొచ్చింది. డబ్బులు పోయిన వెంటనే ఈ నంబర్‌కి కాల్ చేసి కంప్లైట్ చేస్తే తిరిగి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే డబ్బులు పోయిన 24 గంటల్లోగా కంప్లైట్ చేస్తే అమౌంట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే కొత్త నంబర్ వచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఇలాంటి కేటుగాళ్ల మాటలు నమ్మకూడదు. అలాగే ఫేక్ మెసేజ్‌లు, కాల్‌కు అసలు లొంగకూడదు. ఇలా చేస్తే కొంత వరకు డిజిటల్ అరెస్ట్ నుంచి బయటపడవచ్చు.