Credit Card: మనం బట్టలు కొనాలన్నా లేదా ఏదైనా వస్తువు కొనాలన్నా క్రెడిట్ కార్డు వాడుతున్నాం. ప్రస్తుత డిజిటల్ యుగంలో దాదాపు అందరూ ఏదైనా కొనడానికి క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తారు. లాంజ్ యాక్సెస్, ఇంధనం, షాపింగ్.. ప్రతిదానికీ ఒక్కో కార్డు తీసుకుంటున్నాం. బ్యాంకులు కూడా వేర్వేరు ఉపయోగాలకు పలు రకాల క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న వారికి ఈ క్రెడిట్ కార్డులు లాభదాయకం. అది తప్పితే మీరు అప్పుల ఊబిలో చిక్కుకుపోయినట్లే. క్రెడిట్ కార్డులను కలిగి ఉండటం వల్లే ప్రయోజనాలు ఉన్నాయని ఉంచుకుంటే, వాటిని నిర్వహించడంలో, సకాలంలో చెల్లింపులు చేయడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాంటప్పుడు, కొన్ని కార్డులను వదిలించుకోవడం మంచిది. అప్పుడు తక్కువ ఆఫర్లు, పరిమిత క్రెడిట్ లిమిట్స్ ఉన్న కార్డులను రద్దు చేయడం మంచిది. కొన్ని కార్డులు అధిక వార్షిక రుసుములను కలిగి ఉంటాయి. అటువంటి క్రెడిట్ కార్డులను తీసివేయడం మంచిది.
అలాగే ప్రస్తుతం ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మన ప్రమేయం లేకుండానే కొంతమంది కేటుగాళ్లు మన అకౌంట్లలో నుంచి డబ్బుల కాజేస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో సైబర్ కేసులు నమోదవుతున్నాయి. ఎంత నిఘా పెట్టినా ఆ మోసాలకు మాత్రం పోలీసులు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. మన పర్మీషన్ లేకుండానే క్రెడిట్ మన కార్డులో నుంచి ట్రాన్సక్షన్ జరిగిపోతుంటాయి.. అలాంటప్పుడు ఏం చేయాలో ఈ కథనంలో చూద్దాం.
సాధారణంగా మన ఫోనుకు ఏదైనా అనుమానిత లింకులు వచ్చినప్పుడు వాటిని క్లిక్ చేస్తే మన ఫోన్ హ్యాకర్స్ చేతిలోకి వెళ్లి డబ్బులు కట్ అవుతుంటాయి. లేదా మన ఫోనుకు వచ్చిన ఓటీపీ చెప్పినా డబ్బులు కట్ అవుతుంటాయి. అలా కాకుండా మనం ఏం చేయకుండానే మన కార్డు మీద డబ్బులు కట్ అయితే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. మీరు ఓటీపీ చెప్పకుండా, అనుమానిత లింకులను క్లిక్ చేయకుండా మీ కార్డు మీద నుంచి డబ్బులు కట్ అయితే మీరు మూడు రోజుల్లో సదరు బ్యాంకును సంప్రదించాలి. క్రెడిట్ కార్డు మీద జరిగిన మోసాన్ని గురించి బ్యాంకుకు రాతపూర్వకంగా తెలియజేయాలి. అందుకు అవసరం అయిన ప్రూఫ్స్ సమర్పించాలి. రిజర్వ్ బ్యాంకు రూల్ ప్రకారం క్రెడిట్ కార్డు హోల్డర్ తప్పు లేకుండా అతడి కార్డు మీద ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగితే.. బాధితుడు బ్యాంకుకు మూడు రోజుల్లోగా వచ్చి రిపోర్టు చేస్తే ఆ ఖర్చు అంతా బ్యాంకులే భరించాల్సి ఉంటుంది. ఆ డబ్బులను క్రెడిట్ కార్డుకు యాడ్ చేయడం లేదా నెక్ట్స్ బిల్ లో తగ్గించడం చేయాల్సి ఉంటుంది. అందుకు కంప్లైంట్ ఫామ్, మిగతా ప్రూఫ్స్ అందించాల్సి ఉంటుంది.