HomeNewsTTD Trust Board : టీటీడీ ట్రస్ట్ బోర్డ్.. పవన్ కోటాలో ఆ ముగ్గురికి!

TTD Trust Board : టీటీడీ ట్రస్ట్ బోర్డ్.. పవన్ కోటాలో ఆ ముగ్గురికి!

TTD Trust Board : ఎట్టకేలకు టీటీడీ ట్రస్ట్ బోర్డు నియమించింది చంద్రబాబు సర్కార్. సుదీర్ఘ కసరత్తు తర్వాత 23 మందితో కమిటీని ప్రకటించారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోస్ట్ పై రకరకాల చర్చ నడిచింది. రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమిస్తారని ప్రచారం జరిగింది. అనూహ్యంగా టీవీ5 ఛానల్ అధినేత బి ఆర్ నాయుడు కు చైర్మన్ పోస్ట్ దక్కింది. అయితే 23 మంది సభ్యులను సైతం నిర్మించారు. ఇందులో టిడిపి తో పాటు జనసేన, ఇతర రాష్ట్రాల్లోని బిజెపి నేతల సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టుగానే టీటీడీ చైర్మన్ గా మీడియా రంగానికి చెందిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు నియమితులయ్యారు. మాజీ సిజెఐ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు సైతం సభ్యుడిగా ఎంపిక చేశారు. టిడిపి నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నాయకులకు, జనసేన కోటాలో ముగ్గురికి స్థానం దక్కింది. తెలుగుదేశం పార్టీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డిప్రశాంతి రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును నియమించారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి సైతం బోర్డులో చోటు దక్కింది. తెలంగాణ టిడిపి నేత నన్నూరి నర్సిరెడ్డి సైతం బోర్డు సభ్యుడిగా నియమించారు. రాజమండ్రి కి చెందిన కోటేశ్వరరావుకు అవకాశం దక్కింది.

* జనసేన కోటాలో ముగ్గురికి
జనసేన నుంచి అనూహ్యంగా ముగ్గురికి చోటు దక్కడం విశేషం. తెలంగాణ జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి సభ్యుడిగా నియమితులయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్నారు. అలాగే జనసేన పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీకి టీటీడీలో చోటు కల్పించారు. ఆమె భర్త ఎంసీదాస్ పార్టీ ట్రెజరర్ గా కొనసాగుతున్నారు. పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద్ సాయి కి సైతం అవకాశం కల్పించారు. తెలంగాణ యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో ఆనంద్ సాయి కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

* ఎన్నారై విభాగానికి చోటు
మరోవైపు ఎన్నారై విభాగం నుంచి సైతం చోటు ఇచ్చారు. జాస్తి సాంబశివరావును నియమించారు. నన్నపనేని సదాశివరావు రాజధాని ప్రాంతానికి చెందినవారు. నాట్కో తరఫున జిజిహెచ్ లో పలు అభివృద్ధి పనులకు సహకారం అందించారు. భారత్ బయోటిక్ ఎండి సుచిత్ర ఎల్లాకు సైతం టీటీడీ ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు, తమిళనాడుకు చెందిన కృష్ణమూర్తికి నాలుగోసారి అవకాశం దక్కింది. కాఫీ వ్యాపారి ఆర్ఎం దర్శన్, కుప్పం పారిశ్రామికవేత్త శాంతారామ్, చెన్నై కి చెందిన రామ్మూర్తిని సభ్యులుగా నియమించారు. కర్ణాటక నుంచి నరేష్ కుమార్ కు చోటు దక్కింది. ఆర్థిక రంగం నుంచి సౌరబ్ హెచ్ బోరాకు అవకాశం ఇచ్చారు. మొత్తానికైతే రాజకీయ పార్టీలతో పాటు అన్ని రంగాల ప్రముఖులకు ఛాన్స్ ఇచ్చినట్లు అయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular