Megastar Chiranjeevi Records : మన టాలీవుడ్ లో సెర్ హీరోలలో అత్యధిక రికార్డ్స్ ఉన్న హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). రీ ఎంట్రీ తర్వాత ఆయన ఏకంగా మూడు వంద కోట్ల స్తారు సినిమాలను అందుకున్నాడు. మరో టాలీవుడ్ సీనియర్ హీరో ఈ విషయం లో మెగాస్టార్ కి దరిదాపుల్లో కూడా లేరు. అంతెందుకు నేటి తరం స్టార్ హీరోలకు కూడా అన్ని వంద కోట్ల షేర్ సినిమాలు లేవంటే అతిసయోక్తి కాదేమో. 70 ఏళ్ళ వయస్సులోనే ఆయనకు ఈ రేంజ్ రికార్డ్స్ ఉన్నాయంటే, ఇక మెగాస్టార్ నెంబర్ 1 స్థానం లో ఉన్న రోజుల్లో ఏ రేంజ్ రికార్డ్స్ ఉండేవో మీరే ఊహించుకోండి. ఇదంతా పక్కన పెడితే కాసేపట్లో మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu Movie) సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన రికార్డు ని నెలకొల్పాడు.
ఓవర్సీస్ లో మెగాస్టార్ చిరంజీవి మొదటి నుండి సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతూ వచ్చాడు. ఈమధ్య కాలం లో కొన్ని ఫ్లాప్స్ కారణంగా ఆయన నేటి తరం హీరోలకు పోటీ ని ఇవ్వలేకపోయాడు. కానీ ఒక్క ప్రామిసింగ్ సినిమా చేస్తే నేటి తరం స్టార్ హీరోలకు ఆయన స్టామినా ఏ మాత్రం తీసిపోదని ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మరోసారి నిరూపించింది. ఈ చిత్రం నార్త్ అమెరికా లో ప్రీమియర్ షోస్ నుండి 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, సౌత్ ఇండియా మొత్తం మీద సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) తర్వాత , రెండు సార్లు నార్త్ అమెరికా లో 1 మిలియన్ డాలర్స్ ని ప్రీమియర్ షోస్ నుండి రాబట్టిన ఏకైక సీనియర్ హీరో గా చిరంజీవి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇక మన టాలీవుడ్ సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలు తీసి, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ‘అఖండ 2’ కి కనీసం మూడు లక్షల డాలర్స్ ని కూడా రాబట్టలేకపోయాడు. వెంకటేష్ కి లాంగ్ రన్ లో 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి కానీ, ప్రీమియర్స్ షోస్ నుండి కనీసం హాఫ్ మిలియన్ డాలర్స్ ని రాబట్టిన చరిత్ర కూడా లేదు. ఇక నాగార్జున సంగతి సరేసరి. ఆయన మార్కెట్ పూర్తిగా నాశనమై దశాబ్దం దాటింది. మళ్లీ కం బ్యాక్ ఇస్తాడని ఆశలు అక్కినేని అభిమానుల్లో కూడా లేవు. ఇలా తన తోటి సీనియర్ హీరోలు జీవితం లో ఒక్కసారి కూడా సాధించలేకపోయిన 1 మిలియన్ ప్రీమియర్ గ్రాస్ ని చిరంజీవి రెండు సార్లు సాధించి చూపించాడు.