Chiranjeevi cameo rules: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాదాపు 50 సంవత్సరాలుగా మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)…ఎంత మంది హీరోలు వచ్చినప్పటికి ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గదు. ఆయనను మించిన హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరు అనేది కూడా వాస్తవం… ఎందుకంటే నవరసాలను పర్ఫెక్ట్ గా అప్లై చేస్తూ డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా యావత్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరికి పోటీ ని ఇచ్చిన ఏకైక హీరో చిరంజీవి… అలాంటి చిరంజీవి ఈ ఏజ్ లో కూడా సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే చాలామంది వాళ్ళ సినిమాల్లో చిరంజీవితో ఒక గెస్ట్ అప్పీరియన్స్ ఇప్పించాలి అని చాలా రకాల ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు. అయితే ఆయన ఎవరికైనా సరే గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆ సినిమా కథ అతనికి నచ్చాలి. దాన్ని తెరకెక్కించిన విధానం కూడా అతనికి నచ్చాలి. ఇక వీటితోపాటుగా ఆ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కూడా చిరంజీవి అంచనా వేసుకుంటాడు… ఆ డైరెక్టర్ తనకు ముందు ముందు ఏమైనా యూజ్ అవుతాడా? అతని డైరెక్షన్లో సినిమాలు చేస్తే తనకు సక్సెస్ వస్తుందా?
Also Read: హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆదరణ తగ్గిందా..? దానికి కారణం ఎవరు..?
అలాగే ఆయన సినిమాల వల్ల తనకి ఏమైనా హెల్ప్ అవుతుందా? అనే చాలా రకాల క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకుంటారట. మొత్తానికైతే సక్సెస్ ఫుల్ సినిమాల్లోనే ఆయన గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాడు. దాంతో పాటుగా గెస్ట్ అప్పిరియన్స్ సన్నివేశాలు కూడా అతని ఎగ్జైట్ చేయాలి… ఇవన్నీ ఉంటే చిరంజీవి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా ఫ్రీగా నటించడానికి ముందుకు వస్తాడు అంటూ అతని సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇప్పటివరకు ఆయన రాఘవ లారెన్స్ (Raghava Lawrence) డైరెక్షన్లో వచ్చిన స్టైల్ సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చాడు. దాంతోపాటుగా మరో కొన్ని సినిమాల్లో చేసినప్పటికి అవి అతనికి అంత గుర్తింపు ను అయితే తీసుకురాలేదు. స్టైల్ సినిమాలో ఆయన చేసిన పాత్రకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది… ఇప్పుడు కూడా మంచి పాత్ర దొరికితే గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని హిట్ ఇస్తున్నాడు.
Also Read: ఈసారైనా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు నోరు విప్పుతాడా?
కొంతమంది స్టార్ హీరోలు కూడా తమ సినిమాలో చిరంజీవి చేస్తే ఆ సినిమా మీద మంచి హైప్ వస్తుందని భావిస్తున్నారు. అలా అని ఎలాంటి పాత్ర అయిన చిరంజీవి తో చేయించాలని చూస్తే ఆయన ఒప్పుకున్న అతని అభిమానులు మాత్రం ఒప్పుకోరు…అందుకే పాత్ర బాగుంటేనే ఆయన ఒప్పుకుంటాడు…